Vishal34 Titled as a Rathnam: ఆకట్టుకుంటోన్న విశాల్ ‘ రత్నం’ టైటిల్, ఫస్ట్ షాట్ టీజర్

IMG 20231202 WA0052 e1701508850118

Vishal34 Titled as a Rathnam: ఆకట్టుకుంటోన్న విశాల్ ‘రత్నం’ టైటిల్, ఫస్ట్ షాట్ టీజర్

మాస్ హీరో విశాల్ కొత్త సినిమా రత్నం. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి హరి దర్శకత్వం వహించారు. కళ్యాణ్ సుబ్రహ్మణ్యం, అలంకార్ ప్యాండన్ సహ నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. తాజాగా ఈ చిత్రం టైటిల్‌తో పాటుగా, ఫస్ట్ షాట్ టీజర్‌ను విడుదల చేశారు.

IMG 20231201 WA0038

ఈ ఫస్ట్ షాట్ టీజర్ ప్యూర్ గూస్ బంప్స్ స్టఫ్‌లా అనిపించింది. ఆ బ్యాక్ డ్రాప్, ఆ సెటప్, దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన ఆర్ఆర్, కత్తితో తల నరికేయడం, విశాల్ మాస్ అవతారం ఇలా అన్నీ కలిసి ఈ ఫస్ట్ షాట్ టీజర్‌ను అద్భుతం అనేలా చేశాయి. ‘కన్నీరే నెత్తురు చిందగా.. క్రోదమే రుధిరం చిమ్మగా.. ఆగ్రహమే అరుణధారగా.. రణరంగమే రక్తపు ఏరుగా’ అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చే మాటలు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి.

తలని నరికిన రక్తంతో టైటిల్ పేరు రావడం, ఆ రక్తమే రత్నం అనే టైటిల్‌గా మారడం మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాకు వివేక్ పాటలు రాశారు. ఎం సుకుమార్ కెమెరామెన్‌గా పని చేశారు. ఈ చిత్రానికి టీ ఎస్ జయ్ ఎడిటర్. ఆర్ట్ డైరెక్టర్ పీ వీ బాలాజీ. కనల్ కన్నన్, పీటర్ హెయిన్, దిలిప్ సుబ్రయాన్, విక్కీ స్టంట్ మాస్టర్లుగా పని చేశారు.

IMG 20231202 WA0053

విశాల్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, యోగి బాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి వారు నటించిన ఈ మూవీ మిగతా అప్డేట్లు త్వరలోనే రానున్నాయి.

నటీనటులు :

విశాల్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, యోగి బాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు

 

సాంకేతిక బృందం: 

కథ, కథనం, దర్శకత్వం : హరి, నిర్మాత: కార్తికేయన్ సంతానం, జీ స్టూడియోస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అశోక్ నారాయణన్ ఎం, అసోసియేట్ ప్రొడ్యూసర్ : పవన్ నరేంద్ర, కో ప్రొడ్యూసర్ : కళ్యాణ్ సుబ్రహ్మణ్యం, అలంకార్ పాండ్యన్, సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్, కెమెరామెన్ : ఎం సుకుమార్, స్టంట్స్ : కనల్ కన్నన్, పీటర్ హెయిన్, దిలిప్ సుబ్రయాన్, విక్కీ, ఆర్ట్ డైరెక్టర్ : పీ వీ బాలాజీ, లిరిక్స్ : వివేక్, ఎడిటర్ : టీ ఎస్ జయ్, డిజైన్స్ : విక్రమ్ డిజైన్స్, పీఆర్ఓ : సాయి సతీష్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *