KANTARA Music Director Ajaneesh appreciated by AR Rehman:  రెహమాన్ గారు కాంతర మ్యూజిక్ ని మెచ్చుకోవడం నాకు చాలా హ్యాపీ : అజనీష్ లోకనాథ్

ajaneesh kantara e1699960531372

కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా తానే స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సెన్సేషనల్ అండ్ డివోషనల్ హిట్ చిత్రం “కాంతారా”. ఈ సినిమా విడుదల అయిన అన్ని భాషల్లో కూడా  భారీ వసూళ్లతో  బాక్స్ ఆఫీసు రికార్డ్స్ నెలకొల్పింది.  ఈ సినిమాకి వచ్చిన ప్రశంసల్లో ముఖ్యంగా  మ్యూజిక్ అందించిన సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ కి అయితే ప్రత్యేకమైన ప్రశంశలు వచ్చాయి.

కాంతర వచ్చి సంవత్సరాలు గడుస్తునా  ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్  అప్డేట్ అయితే పెట్టాడు మ్యూజిక్ డైరెక్టర్  అజనీష్. అన్నట్టు అజనీష్ తెలుగు లో చేసిన విరూపాక్ష సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అజయ్ భూపతి దర్శకత్వం లో వస్తున్న ” మంగళవారం” సినిమా కి కూడా తనే మ్యూజిక్ అందించారు.

ఇంతకీ అజనీష్ పెట్టిన ఇంటరెస్టింగ్ పోస్ట్ ఏంటంటే   ఆస్కార్ అవార్డు విన్నర్, లెజెండరీ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ తో జరిపిన ఇంటరాక్షన్ పై తాను ఓ సంగీత దర్శకునిగా అలాగే రెహమాన్ కి అభిమానిగా ఎగ్జైట్ అవుతూ న్నాను అన్నారు.

అజనీష్ తన సోషల్ మీడియా అకౌంటు లో ఇలా వ్రాసుకొచ్చారు… రెహమాన్ గారు నిన్ననే కాంతారా సినిమా చూసి ఆ సినిమాలో సంగీతం గొప్పగా ఉంది అంటూ నాతో చెప్పడం ఒక మర్చిపోలేని అనుభూతి అని తెలిపాడు. ఈ వీడియొ కాల్ లో  తాను, రెహమాన్ మరియు హీరో రిషబ్ శెట్టి సహా సింగర్ విజయ్ ప్రకాష్ లు మాట్లాడుకున్నాము. నాకు చాలా సంతోషం గా ఉంది. మ్యూజిక్ లో ఆస్కార్ పొందిన ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ నా మ్యూజిక్ ని మెచ్చుకోవడం చాలా హ్యాపీ..

IMG 20231021 WA00571

ఈ కాన్ఫిరెన్స్ చేసినందుకు సింగర్ విజయ్ ప్రకాష్ కి తాను ప్రత్యేకంగా థాంక్స్ చెప్తున్నాను అని  అజనీష్ తెలిపాడు. అది సంగతి, ఇంతకీ అజనీష్ మ్యూజిక్ అందించిన మంగళవారం సినిమా టిజర్ , ట్రైలర్ మరియు సాంగ్స్ మ్యూజిక్ పరంగా బాగా వైరల్ అవుతున్నాయి. మంగళవారం సినిమా అన్ని భాషలలోనూ నవంబర్ 17 న విడుదల అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *