Ye Chota Nuvvunna Movie Pre release event: సందడిగా “ఏ చోట నువ్వున్నా” సిన్మా ఫ్రీ రిలీజ్ వేడుక ! రిలీజ్ ఎప్పుడంటే ? 

IMG 20231113 WA0078 e1699866628303

 

ఎమ్ ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శాఖమూరి శ్రీనివాసరావు సమర్పణలో మందలపు శ్రీనివాసరావు – మేడికొండ శ్రీనివాసరావు సంయుక్తంగా ఎస్ వి.పసలపూడి దర్శకత్వంలో నిర్మించిన చక్కటి పల్లెటూరి ప్రేమకథా చిత్రం “ఏ చోట నువ్వున్నా”. ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో అత్యంత ఘనంగా నిర్వహించబడింది.

IMG 20231113 WA0079

ఈ సందర్బంగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ చైర్మన్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ “పల్లెటూరి నేపథ్యంలో అందంగా తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రం విజయవంతం అవ్వాలని ఆకాంక్షీస్తూ చక్కటి కథాంశాన్ని ఎన్నుకొన్న దర్శకుడు ఎస్.వి. పసలపూడి, నిర్మాతలు మందలపు శ్రీనివాసరావు, మేడికొండ శ్రీనివాసరావులను అభినందించారు.

అదే విధంగా ఈవెంట్ కి హాజరైన ప్రముఖ దర్శకులు వి.ఎన్ ఆదిత్య, ఎ. ఎస్ రవికుమార్ చౌదరి, నర్రా శివనాగు, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, యువ నిర్మాత అహితేజ బెల్లంకొండ, ప్రముఖ నటులు- నిర్మాత రాంకీ, ప్రముఖ రచయిత మరుదూరి రాజా, ఈవెంట్ స్పాన్సర్ చేసిన ప్రముఖ వ్యాపారవేత్త ఎల్.ఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శివ రెమిడాల చిత్ర విజయాన్ని కోరుకుని యూనిట్ కి అభినందనలు తెలిపారు!!

IMG 20231113 WA0077

చిత్ర దర్శక నిర్మాతలకు అత్యంత సన్నిహితులు, “రారా పెనిమిటి” దర్శకనిర్మాత సత్య వెంకట్ గెద్దాడ చిత్ర యూనిట్ ని సభకు పరిచయం చేశారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. “ఈ చిత్రాన్ని నెల 17న విడుదల చేస్తున్నాం. దర్శకుడు ఎస్.వి పసలపూడి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్” అని కొనియాడారు.

 

దర్శకుడు ఎస్. వి మాట్లాడుతూ “నిర్మాతల సహాయసహకారాలు మరువలేనివి. మా చిత్రానికి తరుణ్ రాణా ప్రతాప్ సమాకూర్చిన సంగీతం ఆకట్టుకుంటుంది. రచయిత కుమార్ పిచ్చుక రాసిన మాటలు ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తాయి. ఈ చిత్రం ప్రేక్షకుల మన్నలను కచ్చితంగా పొందుతుంది” అని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు!!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *