WAR2 shoot update: వార్2 షూటింగ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకొన్న YRF యూనిట్ ! త్వరలోనే స్టార్ట్ !

war 2 ntr hr

ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో పాటు క్రేజీ కాంబో చిత్రమైన “వార్ 2” మీదనే అందరి దృష్టి ఉంది. ఎందుకంటే వార్-2 లో యంగ్ టైగర్ యన్టి రామరావ్ ఉన్నాడు కాబట్టి.  మరి గత పార్ట్ 1 లో హృతిక్ రోషన్ మరియు టైగర్ ష్రాఫ్ లు నటించగా ఈ పార్టు కి RRR తో యన్టీఆర్ వరల్డ్ వైడ్ గా తెచ్చుకొన్న ఫేమ్ ని వార్ -2 మేకర్స్ మార్కెట్ చేసుకోవడం కోసం  కోసం టైగర్  ష్రాఫ్ తప్పించి యంగ్ టైగర్ ని తీసుకోవడం జరిగింది.

war 1

ఈసారి పార్ట్ 2 లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ లు నటిస్తుండడంతో హైప్ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది. అందుకే ఈ సినిమాకి మాత్రం అటు బాలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు సెట్ అయ్యాయి. మరి లేటెస్ట్ గా అయితే ఓ ఇంట్రెస్టింగ్ బజ్ ఈ సినిమాపై వినిపిస్తుంది. మేకర్స్ షూటింగ్ కోసం సర్వం సిద్ధం చేస్తుండగా ఎన్టీఆర్ మరియు హృతిక్ లు కూడా త్వరలోనే సెట్స్ లో జాయిన్ కానున్నారు.

war hruthik

ఈ వార్ -2 సినిమా షూటింగ్ మొత్తం కూడా  ఫారిన్ కంట్రీస్ లోనే జరపడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే దర్శకుడు అయాన్ ముఖర్జీ కూడా ఆల్రెడీ లొకేషన్స్ ని లాక్  చేసి నట్టు తెలుస్తుంది. షూటింగ్ అంతా విదేశాలలో జరుగుతుంది కాబట్టి,  హీరోస్ కూడా ఎక్కువ విదేశాల్లోనే ఉంటారని తెలుస్తుంది.

కధ పరంగా కొన్ని ఏక్షటిరియాల్ షాట్స్ మాత్రం ఇండియాలో అంటే ముంబై సిటీ లో కొన్ని పోర్షన్స్ వరకు షూట్ ఉంటుంది  అని మేకర్స్ చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *