Raviteja TIGER MOVIE Review: టైగర్ నాగేశ్వరరావు గా రవితేజ విజృంభించాడు!

InShot 20231020 194139806 e1697811162619

మూవీ: టైగర్ నాగేశ్వరరావు

విడుదల తేదీ : అక్టోబరు 20, 2023,

నటీనటులు: రవితేజ, అనుపమ్ ఖేర్, గాయత్రి భరద్వాజ్, నుపుర్ సనన్, రేణు దేశాయ్, నాసర్, మురళీశర్మ, జిస్సు సేన్‌గుప్తా, సుదేవ్ నాయర్, హరీష్‌పెరాడి మరియు ఇతరులు

దర్శకుడు : వంశీ

నిర్మాత: అభిషేక్ అగర్వాల్

సంగీతం: జివి ప్రకాష్ కుమార్

సినిమాటోగ్రఫీ: ఆర్. మధి

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

 

మూవీ రివ్యూ: టైగర్ నాగేశ్వరరావు (TNR)

మొదట సారిగా పాన్ ఇండియా మూవీ అంటూ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ హీరోగా నటించిన  సినిమా టైగర్ నాగేశ్వరరావు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. మరి ఈ సినిమా సినీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో మా 18F మూవీస్ రివ్యూ లో చదివి తెలుసుకుందామా !

IMG 20231019 WA0219

కధ పరిశీలిస్తే: 

స్టూవర్టుపురం ప్రాంతంలోని ప్రజలంతా దొంగతనాలే వృత్తిగా బతుకుతూ ఉంటారు. వారి ఆకలిని, అవసరాలను అవకాశంగా చేసుకుని.. అక్కడి అధికారులంతా వారిని తమకు అనుగుణంగా వాడుకుంటూ దోచుకుంటూ వారిని అణిచివేస్తారు. అవన్నీ చూసి పెరిగిన నాగేశ్వరరావు (రవితేజ) వాటి పై…

ఎలాంటి పోరాటం చేశాడు?,

తన స్టూవర్టుపురం ప్రజల బాగు కోసం ఏం చేశాడు ?,

ఈ క్రమంలో స్టూవర్టుపురం నాగేశ్వరరావు నుంచి టైగర్ నాగేశ్వరరావుగా ఎలా రూపాంతరం చెందాడు ?,

ఈ మధ్యలో నాగేశ్వరరావు యుక్త వయసులో ఉన్నప్పుడు సారా (నుపుర్ సనన్) తో ఎలా ప్రేమలో పడ్డాడు ?,

చివరకు టైగర్ నాగేశ్వరరావు జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ?,

ఇంతకీ నాగేశ్వరరావు తాను అనుకున్నది సాధించాడా ?, లేదా ? అనేది తెలియాలి అంటే సినిమా ఏంటనే దియేటర్ కి వెళ్ళి చూడండి.

కథనం ( స్క్రీన్ – ప్లే) పరిశీలిస్తే: 

IMG 20231020 085144

టైగర్ నాగేశ్వరరావు లో మెయిన్ కంటెంట్ అండ్ రవితేజ పెర్ఫార్మెన్స్, మాస్ ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ డిజైన్ చేసినదానికంటే బాగా ఉన్నాయి. ట్రీట్మెంట్ విషయంలో కొన్ని చోట్ల బాగా స్లో అనిపించింది.

దర్శకుడు వంశీ కథనం విషయంలో రాజీపడకుండా ఉండి ఉంటే బాగుండేది. ముఖ్యంగా రెండవ అంకం (సెకండాఫ్) లో సినిమా జరుగుతున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను ఇంకా పెంచగలిగే స్కోప్ ఉన్నపటికీ దర్శకుడు ఆ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేదు.

అలాగే సెకండ్ హాఫ్ ను కాస్త ఎమోషనల్ గా నడుపుదామని మంచి ప్రయత్నం చేశారు గాని, కొన్ని చోట్ల అది స్క్రీన్ మీద ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు. అలాగే 1970 – 80వ దశకంలో కథ సాగుతున్నప్పుడు అప్పటి నేటివిటీని దృష్టిలో పెట్టుకొని సన్నివేశాలను చిత్రీకరించి ఉంటే బాగుండేది. అలాగే టైగర్ నాగేశ్వరరావు పాత్రను మొదట్లో చూపించిన ఎలివేషన్స్.. దర్శకుడు సినిమా మొత్తం సస్టైన్ చేయలేకపోయాడు. ఇక మధ్య మధ్యలో వచ్చే ప్రేమ సన్నివేశాలు కథ ప్లోకి అడ్డు పడ్డాయి.

దర్శకుడు, నటి నటుల ప్రతిభ పరిశీలిస్తే:

IMG 20231020 WA0174

దర్శకుడు వంశీ మంచి కథను తీసుకోవడంలో సక్సెస్ అయ్యాడు ఆని చెప్పవచ్చు. కథా పాత్రలూ బాగా  డిజైన్ చేసినా ఉత్కంఠ భరితమైన కథనాన్ని రూపొందించడంలో, దాన్ని ఇంకా ఉత్కంఠభరితంగా తెరకెక్కించడంలో సక్సెస్ కాలేక పోయాడు అని చెప్పవచ్చు

స్టూవర్టు పురంలో టెర్రర్ రాజ్యంపై ఆధిపత్యం చెలాయించి, తన వాళ్లకు జీవితాన్ని ఇచ్చిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా నడిచిన ఈ కథలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్, కొన్ని ఎమోషన్స్, అలాగే సాహసోపేతమైన దోపిడీ సన్నివేశాలు మరియు నటీనటులు పనితనం ఆకట్టుకుంది.

రవితేజ తన కెరీర్ లో ఒక ఛాలెంజ్ గా ఈ పాత్రలో నటించిన విధానం మెప్పిస్తుంది. తన గత సినిమాల్లో కంటే ఈ సినిమాలో రవితేజ కొత్త లుక్స్ తో చాలా ఫ్రెష్ గా యంగ్ గా కనిపించాడు.

ఇక హీరోయిన్ గా నటించిన నుపుర్ సనన్ తన నటనతో ఆకట్టుకుంది. కొన్ని చోట్ల సందర్భానుసారంగా ఆమె పలికించిన హావభావాలు మరియు ఆమె నటన బాగుంది.

మరో హీరోయిన్ గా చేసిన గాయత్రి భరద్వాజ్ కూడా మెప్పించింది. హేమలత లవణం పాత్రలో రేణు దేశాయ్‌ ఒదిగిపోయింది.

అనుపమ్ ఖేర్, నాజర్, మురళీశర్మ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. జిస్సు సేన్‌గుప్తా మరో ముఖ్యమైన పాత్రలో చాలా బాగా నటించాడు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

అభిషేక్ అగర్వాల్ చాలా డీసెంట్కీ గా క్వాలిటీగా ఈ మూవీ తెరకెక్కించాడు.

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:

IMG 20231020 WA0171

మంచి కథను తీసుకోవడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు వంశీ. కానీ, ఉత్కంఠభరితమైన కథనాన్ని రూపొందించడంలో, దాన్ని ఇంకా ఉత్కంఠభరితంగా తెరకెక్కించడంలో సక్సెస్ కాలేక పోయాడ. ఇక సినిమాకు పనిచేసిన సాంకేతిక టీమ్ పనితనం బాగుంది. సన్నివేశాలకు అనుగుణంగా సాంకేతిక వర్క్ సాగింది. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం పర్వాలేదు. కాకపోతే, ఆయన అందించిన నేపధ్య సంగీతం సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు పనితనం బాగుంది. ఆర్. మధి సినిమాటోగ్రఫీ కూడా మెచ్చుకునేలా సాగింది. ఎక్కడా బ్యూటీ తగ్గకుండా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దారు ఆయన. అభిషేక్ అగర్వాల్ నిర్మాణ విలువలు బాగున్నాయి

18F మూవీస్ టీం ఒపినియన్:

IMG 20231019 WA0220

రవితేజ న్యూ లుక్ తో వచ్చిన  టైగర్ నాగేశ్వరరావు సినిమా ఎమోషనల్ యాక్షన్ డ్రామా తొ పర్వాలేదు అనిపిస్తోంది. రవితేజ పెర్ఫార్మెన్స్, మాస్ ఎలివేషన్స్, భారీ యాక్షన్ సీన్స్, మరియు కొన్ని డెప్త్ ఎమోషన్స్ సామాన్య సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఐతే, కథనం (స్క్రీన్ ప్లే) స్లో గా సాగడం, సినిమాలో ల్యాగ్ సీన్స్ అండ్ రిపీటెడ్ సీన్స్ ఎక్కువైపోవడం మరియు కొన్ని ఫేక్ ఎమోషన్స్ వంటి అంశాలు సినిమాకి నెగిటివ్ టాక్  తేవచ్చు.  ఓవరాల్ గా కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే ఈ చిత్రంలో కనెక్ట్ అవ్వవు కానీ మొత్తం సినిమా స్టైలిష్ లుక్ తొ డీసెంట్ గా ఉంది.

చివరి మాట: టైగర్ గాండ్రించింది!

IMG 20231020 083700

18F MOVIES RATING: 2.75 / 5, 

*కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *