Jetender Reddy First look: జితేందర్ రెడ్డి ఎవరో తెలుసా?

IMG 20231002 WA0069

బాహుబలి మరియు ఎవ్వరికీ చెప్పొద్దు సినిమాల తో ప్రేక్షకులకి సుపరిచితులు అయిన రాకేష్ వర్రే ఎప్పుడూ ప్రయోగాత్మక పాత్రలనే ఎంచుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం జితేందర్ రెడ్డి అనే పేరుతో హీరో ఎవరో తెలియకుండా పోస్టర్లు రిలీజ్ చేశారు. పోస్టర్లు చూడడానికి చాలా పవర్ ఫుల్  గా ఉన్నప్పటికి అందులో ఉన్న కథానాయకుడు ఎవరు?, అసలు టైటిల్ లో ఉన్న ఈ జితేందర్ రెడ్డి ఎవరు? అని చర్చనీయాంశం అయ్యింది.

IMG 20230718 WA0039

ఒక వ్యక్తి కొంత మంది జనాల ముందు కూర్చుని చిన్న పాప మీద చెయ్యి వేసి నాయకుడు శైలిలో కనిపిస్తాడు. కాని ఆ పోస్టర్ లో కూడా హీరో ఎవరు అనేది తెలియడం లేదు. ఆ పోస్టర్ తో అసలు ఆ పాత్ర చెయ్యబోతున్న హీరో ఎవరు?, ఎందుకు అతన్ని దాచారు అని రకరకాల కథనాలు ఇండస్ట్రీలో వినిపించాయి.

IMG 20230918 WA01362

ఇప్పుడు ఆ సస్పెన్స్ ని రివీల్ చేస్తూ ఇంకో పోస్టర్ ని విడుదల చేశారు. జితేందర్ రెడ్డి పాత్రలో రాకేష్ వర్రే గన్ పట్టుకుని ఎంతో డైనమిక్ గా నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది ఆ పోస్. చూడడానికి ఒక యంగ్ పోలీస్ లాగా ఉన్నాడు. కాకపోతే ముందు రిలీస్ చేసిన పోస్టర్స్ లో లీడర్ లుక్స్ ఉన్నాయి.

IMG 20230918 WA01342

హీరోగా ఒక సినిమా చేసి హిట్ అందుకున్న తరు వాత కూడా ఇంత గ్యాప్ తీసుకుని ఈ జితేందర్ రెడ్డి సినిమానే రాకేష్ ఎందుకు ఎంచుకున్నారు, అసలు ఈ కథలో మరియు ఆ పాత్రలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? అనేది జితేందర్ రెడ్డి సినిమా గురించి మరిన్ని అప్ డేట్స్ కొరకు వేచి చూడాల్సిందే.

IMG 20231002 WA0068

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఈ జితేందర్ రెడ్డి క్యారెక్టర్ కి సరైన నటుడు కోసం దర్శకుడు విరించి వర్మ దాదాపు 6 నెలల పాటు అనేక మందిని రిజెక్ట్ చేసి చివరికి రాకేష్ వర్రే మాత్రమే ఈ పాత్రకి సరిపోతారని నమ్మి తీసుకున్నారు. రాకేష్ ఈ క్యారక్టర్ కి ఎంత న్యాయం చేశారనేది మున్ముందు వచ్చే అప్ డేట్స్ లో చూడాలి ఇంకా ఎన్ని కొత్త ప్రయోగం చేస్తారో..!

డైరెక్టర్ : విరించి వర్మ.

నిర్మాత : ముదుగంటి రవీందర్ రెడ్డి.

కో – ప్రొడ్యూసర్ : ఉమ రవీందర్.

ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వాణిశ్రీ పొడుగు

డి. ఓ. పి : వి. ఎస్. జ్ఞాన శేఖర్.

మ్యూజిక్ డైరెక్టర్ : గోపి సుందర్.

నటీ నటులు : రాకేష్ వర్రే,

సుబ్బరాజు , శ్రీయాసరన్.

పిఆర్ఓ : మధు విఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *