హీరో సూర్య చేతుల మీదగా హిట్ లిస్ట్ మూవీ టీజర్ లాంచ్ ! 

IMG 20240517 WA0352 e1715947188480

తమిళ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్ ముఖ్యపాత్రలో నటించిన సినిమా హిట్ లిస్ట్. సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ దర్శకత్వంలో ఆర్. కె. సెల్యులాయిడ్స్ పై డైరెక్టర్ కె. ఎస్. రవికుమార్ గారు నిర్మిస్తున్నారు..

గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమా పైన అంచనాలను పెంచగా. నేడు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ వెర్సటైల్ హీరో సూర్య చేతుల మీదగా లాంచ్ చేశారు.

IMG 20240517 WA0353

యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ జోనర్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ చాలా బాగుంది. ప్రెసెంట్ ఆడియన్స్ ని ఎక్కువగా క్రైమ్, సస్పెన్స్ జానర్ మూవీస్ అట్రాక్ట్ చేస్తున్నాయి ఇది కూడా ఆ జానర్ లోకి రావడం అదే విధంగా టీజర్ సినిమా పైన అంచనాలను పెంచేస్తోంది.

IMG 20240517 WA0351

టీజర్ చూసిన అనంతరం హీరో సూర్య మాట్లాడుతూ : టీజర్ చాలా బాగుంది సినిమా ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా విజయ్ కనిష్క కి ఈ టీం కి మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటీనటులు :

విజయ్ కనిష్క, శరత్ కుమార్, సముద్రఖని, గౌతమ్ వాసుదేవ మీనన్, మునిష్కాంత్ కింగ్స్ లే, సితార, స్మృతి వెంకట్, రామచంద్ర రాజు (కే జి ఎఫ్ గరుడ), రామచంద్రన్, ఐశ్వర్య దత్త, అభి నక్షత్రం.

టెక్నీషియన్స్ :

నిర్మాణం : ఆర్. కె. సెల్లులాయిడ్స్ నిర్మాత : కె. ఎస్ రవికుమార్, ఎడిటర్ : జాన్ అబ్రహం, మ్యూజిక్ : సి. సత్య, డి ఓ పి : కే. రామ్ చరణ్, కథ : ఎస్. దేవరాజ్ , దర్శకత్వం : సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్, తెలుగు రాష్ట్రాల రిలీజ్ : శ్రీ శ్రీనివాస స్క్రీన్స్, శ్రీ శ్రీనివాస ఇన్ఫ్రా, బెక్కం ప్రొడక్షన్స్, డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణంపి ఆర్ ఓ : మధు VR.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *