హార్ట్ టచింగ్ సబ్జెక్టుతో, భావోద్వేగాన్ని ఆవిష్కరించబోతున్న సినిమా ‘నాన్నంటే’. ఏఆర్ ఫిల్మ్ బ్యానర్ పై, నాగేశ్వర్ సమర్పణలో, నంది వెంకట్ రెడ్డి దర్శకత్వంలో, అశోక్ రెడ్డి లెంకల నిర్మించిన చిత్రం ‘నాన్నంటే’. YSK (వై ఎస్ కె ), నిహరిక చౌదరి, వరేణ్య ఆగ్రా, అశోక్ రెడ్డి లెంకల, తోట సుబ్బారావు, వి.కరుణాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రీమియర్ షోను హైదరాబాద్ ఫిలించాంబర్‌లో ప్రదర్శించారు. పలువురు సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు ఈ ప్రీమియర్ షోను తిలకించి చిత్రయూనిట్‌ను అభినందించారు.
ప్రతి ఒక్కరికి నాన్న అంటే ఎంతో ఎమోషన్ ఉంటుందో ఈ సినిమాలో దర్శకుడు చక్కగా చూపించారని ప్రశంసించారు. ఈ సినిమాలోని మెసెజ్ ప్రతి ఒక్క యువతకి కనెక్టు అవుతుందన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత అశోక్ రెడ్డి లెంకల మాట్లాడుతూ.. “నాన్న కష్టాన్ని, త్యాగాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించాం. ప్రతి ఒక్కరు ఈ సినిమాను ఆదరించాలి. అతి త్వరలోనే సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నాం” అని అన్నారు.
వైఎస్‌కే, నిహరిక చౌదరి, వరేణ్య ఆగ్రా లంకెల అశోక్ రెడ్డి, కోట శంకర్ రావు, తోట సుబ్బారావు, వి.కరుణాకర్, మంచికంటి వేంకటేశ్వర్లు, దుర్గా ప్రసాద్, తన్నీరు నాగేశ్వర్, ఎన్. విజయలక్ష్మి, ఎ. విజయ, అంబికా, ఏ.పూజిత రెడ్డి, మాస్టర్ ఆషు, లక్ష్మీ రామ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ డ్రమ్స్ రామ్, DOP డి. యాదగిరి, నిర్మాత లంకెల అశోక్ రెడ్డి, కథ, స్రీన్ ప్లే, దర్శకత్వం నంది వెంకట్ రెడ్డి, పి.ఆర్.ఓ దయ్యాల అశోక్.