సైకలాజికల్ థ్రిల్లర్ “కలి” మూవీ నుంచి రొమాంటిక్ మెలొడీ సాంగ్ ! 

IMG 20241001 WA0257 e1727803951512

 యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా “కలి“. ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు రచించి దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “కలి” మూవీ నుంచి రొమాంటిక్ మెలొడీ సాంగ్ ‘హల్లో హల్లో..’ ను రిలీజ్ చేశారు మేకర్స్.

హల్లో హల్లో..’ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి బ్యూటిఫుల్ లిరిక్స్ అందించగా, జీవన్ బాబు (జె.బి.) ప్లెజెంట్ ట్యూన్ తో కంపోజ్ చేశారు. హైమత్ హైమత్ అహ్మద్, అదితీ భావరాజు మంచి ఫీల్ తో పాడారు.

  ‘హల్లో హల్లో హల్లో పూలదారుల్లో పాదం వేద్దాం ఓ పిల్లో, ఛల్లో ఛల్లో ఛల్లో రంగు రంగుల్లో జీవించేద్దాం ఛల్ ఛల్లో, కలవని దూరం దూరం నిన్న వరకు, అడుగులో అడుగేసేద్దాం చివరి వరకు…’అంటూ రొమాంటిక్ గా సాగుతుందీ పాట. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ కథకు ‘హల్లో హల్లో..’ పాట కలర్ ఫుల్ పిక్చరైజేషన్ తో కొత్త ఫ్లేవర్ తీసుకొస్తోంది.

నటీనటులు :-

ప్రిన్స్, నరేష్ అగస్త్య, నేహా కృష్ణన్, గౌతంరాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, మని చందన, మధుమణి. తదితరులు.

టెక్నికల్ టీమ్:: 

సంగీతం – జీవన్ బాబు, ఎడిటర్ – విజయ్ కట్స్., సినిమాటోగ్రఫీ – నిషాంత్ కటారి, రమణ జాగర్లమూడి., పాటలు – సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి,, క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ – రాధాకృష్ణ తాతినేని, ధరణి కుమార్ టీఆర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఫణీంద్ర, , పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), సమర్పణ – కె. రాఘవేంద్ర రెడ్డి, నిర్మాత – లీలా గౌతమ్ వర్మ, రచన, దర్శకత్వం – శివ శేషు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *