‘శివం భజే’ కి నైజాం ఏరియాలో గ్రాండ్ రిలీజ్ ఇవ్వనున్న మైత్రి మూవీ మేకర్స్ !

IMG 20240729 WA0042 scaled e1722230767110

ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1న విడుదలకి సిద్ధంగా ఉన్న గంగా ఎంటర్టైన్మంట్స్ ‘శివం భజే’ చిత్రాన్ని నైజాం ఏరియాలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు ‘మైత్రి మూవీ మేకర్స్’.

ఇటీవల విడుదలైన పాటలకి, ట్రైలర్ కి ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో అనూహ్యమైన స్పందన లభిస్తుండడంతో మార్కెట్ లో అంచనాలు భారీగా పెరిగాయి.

దాంతో నైజాం ఏరియాలో గ్రాండ్ రిలీజ్ చేయడానికి మైత్రి మూవీ మేకర్స్ ఎల్. ఎల్. పి లాంటి పెద్ద సంస్థ ముందుకొచ్చింది.

ట్రైలర్ లో చూపించినట్టుగా ఇంటర్నేషనల్ క్రైమ్, మర్డర్ మిస్టరీ, సీక్రెట్ ఏజెంట్, శివుడి ఆట లాంటి అనేక అంశాలతో న్యూ ఏజ్ కథనాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని అర్థమైంది. వికాస్ బడిస నేపథ్య సంగీతం, శివేంద్ర విజువల్స్, హీరో అశ్విన్ నటన, గంగా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు, అప్సర్ దర్శకత్వం ఇలా ఎన్నో హైలెట్స్ తో తెరకక్కనున్న ఈ న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో అశ్విన్ సరసన, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్ గా నటించారు.

అర్బాజ్ ఖాన్, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల్తాన తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.

 సాంకేతిక వర్గం:

ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్,ప్రొడక్షన్ డిజైనర్ : సాహి సురేష్,, మ్యూజిక్ డైరెక్టర్ : వికాస్ బడిస, ఫైట్ మాస్టర్: పృథ్వి, రామకృష్ణ ,డీ ఓ పి: దాశరథి శివేంద్ర, పి ఆర్ ఓ: నాయుడు సురేంద్ర కుమార్ – ఫని కందుకూరి (బియాండ్ మీడియా),మార్కెటింగ్: టాక్ స్కూప్,,నిర్మాత : మహేశ్వర్ రెడ్డి మూలి, దర్శకత్వం : అప్సర్.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *