విజయ్ ఆంటోనీ  “తుఫాన్” నుండి మరో లిరికల్ సాంగ్ రిలీజ్ ‘ఇతడెవరు’!,  థియేట్రికల్ రిలీజ్ ఎప్పుడంటే !

thoofan vijay antony e1721223390299

హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తుఫాన్”. ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ లో “తుఫాన్” సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్.

“తుఫాన్” సినిమాను ఆగస్టు 2న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ‘ఇతడెవరు’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.

‘ఇతడెవరు’ లిరికల్ సాంగ్ ను విజయ్ ఆంటోనీ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా భాష్యశ్రీ గుర్తుండిపోయే సాహిత్యాన్ని అందించారు. సంతోష్ హరిహరన్ ఆకట్టుకునేలా పాడారు. ‘ఇతడెవరు ఇతడెవరు తెలియని ఓ చరితో, లోతైన ఓ కడలో ..తను గాథో ఎద బాధో..తను ఉరుమో లేక పిడుగో..’ అంటూ కథానాయకుడి ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో పవర్ ఫుల్ గా సాగుతుందీ పాట. ‘ఇతడెవరు’ లిరికల్ సాంగ్ ను థియేటర్స్ లో ప్రేక్షకులు ఎంజాయ్ చేయబోతున్నారు.

నటీనటులు :

విజయ్ ఆంటోనీ, శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వన్నన్, తలైవాసల్ విజయ్ తదితరులు

టెక్నికల్ టీమ్: 

కాస్ట్యూమ్స్ – షిమోనా స్టాలిన్, డిజైనర్ – తండోరా చంద్రు, యాక్షన్ కొరియోగ్రాఫర్ – సుప్రీమ్ సుందర్, ఆర్ట్ డైరెక్టర్ – అరుముగస్వామి, ఎడిటింగ్ – ప్రవీణ్ కేఎల్, మ్యూజిక్ – అచ్చు రాజమణి, విజయ్ ఆంటోనీ, డైలాగ్ రైటర్ – భాష్య శ్రీ, పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), నిర్మాతలు – కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా, రచన, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ – విజయ్ మిల్టన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *