వింధ్య గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్ లో సందడి చేసిన ఈషా రెబ్బ

IMG 20250525 WA0070 e1748164878595

 నగరంలోని ప్రముఖ షాపింగ్ హబ్ శరత్ సిటీ మాల్ (AMB Mall కొండాపూర్‌)లో వింధ్య గోల్డ్ (Viindya Gold) – సిల్వర్ బార్ ఛాలెంజ్‌ ఈవెంట్ కు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఈషా రెబ్బ హాజరై సందడి చేశారు. మే 23న ప్రారంభమైన ఈ ఈవెంట్ 25వ తేదీ వరకు కొన‌సాగుతుంది.

IMG 20250525 WA0072

ఈ సందర్భంగా హీరోయిన్ ఈషా రెబ్బ మాట్లాడుతూ, “బంగారం లాంటి వేడుక ఇది. ఈవెంట్ చాలా గ్రాండ్ గా కలర్ ఫుల్ గా ఉంది. ఈ తరహా వినూత్న ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కరికి మరిచిపోలేని అనుభూతినిస్తాయి. వింధ్య గోల్డ్‌ వంటి నమ్మకమైన బ్రాండ్‌ నిర్వహిస్తుండటంతో మరింత విశ్వసనీయంగా అనిపిస్తోంది. వింధ్య గోల్డ్ పర్చేజ్ ప్లాన్ భవిష్యత్ కు బంగారు భరోసా లాంటిది అని” అని అన్నారు.

గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్‌లో సందర్శకులతో పాటు ఈషా రెబ్బ సంద‌డి చేసి ఉత్సాహ‌ప‌రిచారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్‌లో సందర్శకులు ఉత్సాహంగా పాల్గొంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఛాలెంజ్‌లో విజేతలకు బంగారు, వెండి నాణేలు బహుమతులుగా అందజేయడం ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

IMG 20250525 WA0080

ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఆభరణాల్ని అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్న వింధ్య గోల్డ్, ఈ కార్యక్రమం ద్వారా తమ బ్రాండ్ విశ్వసనీయతను మరింత బలోపేతం చేసింది. భారీ సంఖ్యలో సందర్శకులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయగా, నిర్వాహకులు పాల్గొన్న ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *