లేడీ బాస్‌గా అన్నీ తానై నడిపిస్తున్న సుమయా రెడ్డి‌కి ‘డియర్ ఉమ’ టీం స్పెషల్ బర్త్ డే విషెస్!

InShot 20240518 120516812 e1716014181876

ఓ తెలుగు అమ్మాయి హీరోయిన్‌గా అవకాశం దక్కించుకోవడమే గొప్ప విషయం. అలాంటిది సుమయా రెడ్డి అనే ఓ తెలుగు అమ్మాయి ‘డియర్ ఉమ’ అంటూ మొదటి సినిమాతోనే నిర్మాతగా మారడం, కథను అందించడం, హీరోయిన్‌గా నటించడం అంటే మామూలు విషయం కాదు.

ఇలా అన్నీ తానై ఓ లేడీ బాస్‌గా సినిమాను ముందుకు నడిపిస్తోంది. డియర్ ఉమ సినిమాతో సుమయా రెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

IMG 20240516 WA0214

సుమయా రెడ్డి, పృథ్వీ అంబర్ హీరో హీరోయిన్లుగా సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద సుమయా రెడ్డి నిర్మించిన చిత్రం డియర్ ఉమ. ఈ చిత్రానికి సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, నవ్వుతుంటనే లిరికల్ వీడియో సాంగ్ ద్వారా సినిమాలోని ఫీల్ గుడ్ ఎమోషన్‌కు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. అందమైన ప్రేమ కథా చిత్రంగా డియర్ ఉమ అందరినీ ఆకట్టుకునేలా ఉందని అంతా ఫిక్స్ అయ్యారు.

IMG 20240518 WA0222

సుమయా రెడ్డి పుట్టిన రోజు (మే 18) సందర్భంగా చిత్రయూనిట్ ఆమెకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలిపారు. అన్నీ తానై నడిపిస్తున్న తమ లేడీ బాస్‌కు చిత్రయూనిట్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

త్వరలోనే సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *