‘లగ్గం’ ఆడియో రైట్స్ ని ఆదిత్య మ్యూజిక్ enthaku కొన్నారో తెలుసా !

laggam audio rights bought by Aditya Music e1718438988912

సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల రచన -దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్లిలో ఉండే సంబురాన్ని, విందుని, చిందుని, కన్నుల విందుగా చూపించబోతున్నారు. ఇది కల్చరర్ ఫ్యామిలీ డ్రామా ప్రతి ఒక్కరు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు, కొత్త ఎక్స్పీరియన్స్ కళ్ళముందు ఉంచే ఈ చిత్రం కొన్ని తరాలు గుర్తుంచుకునే చిత్రమవుతుందని నటకిరిటి రాజేంద్రప్రసాద్ గారు తెలిపారు.

షూటింగ్ పూర్తి చేసుకొని శర వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న లగ్గం సినిమా పాటలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఈ సినిమాకి చరణ్ అర్జున్ సంగీతం అందించారు.
ప్రముఖ ఆడియో కంపెనీ అయిన ఆదిత్య మ్యూజిక్ సంస్థ లగ్గం ఆడియో రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకోవడం విశేషం.

laggam audio rights bought by Aditya Music 1

జూన్ 21న ఫస్ట్ లిరికల్ సాంగ్ ను ప్రముఖ దర్శకుడు చేతుల మీదుగా విడుదల చేయబోతున్నారు. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ లగ లాగ లగ్గం సాంగ్ అందరిని ఆలరించనుందని వేణు గోపాల్ రెడ్డి గారు అన్నారు.

ఈ చిత్రానికి కథ – మాటలు- స్క్రీన్ ప్లే- దర్శకత్వం రమేశ్ చెప్పాల, సంగీతం:చరణ్ అర్జున్.ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి. కెమెరామెన్: బాల్ రెడ్డి. ఆర్ట్:కృష్ణ సాహిత్యం: చరణ్ అర్జున్,సంజయ్ మహేశ్ వర్మ, కొరియోగ్రఫీ. అజయ్ శివశంకర్.

laggam audio rights bought by Aditya Music 2

నటీనటులు:

సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య గంధం, టి. సుగుణ ,లక్ష్మణ్ మీసాల, ప్రభావతి. కంచరపాలెం రాజు, ప్రభాస్ శ్రీను, సత్య ఏలేశ్వరం, అంజిబాబు, రాదండి సదానందం, కిరీటి తదితరులు ప్రముఖ పాత్ర పోషించారు.,

సాంకేతిక వర్గం : 

కథ,మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమేష్ చెప్పాల,సంగీతం: చరణ్ అర్జున్,ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి
సినిమాటోగ్రాఫర్: బాల్ రెడ్డి,ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ,సాహిత్యం: చరణ్ అర్జున్, సంజయ్ మహేష్ వర్మ
కొరియోగ్రఫీ: అజయ్ శివ శంకర్. 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *