రీ రిలీజ్ లో కూడా కుమ్మేస్తున్న శింబు జ్యోతిక ల మన్మధ !

IMG 20241006 WA0135 scaled e1728214215635

శింబు, జ్యోతిక హీరో హీరోయిన్లు గా 2004లో విడుదలైన మన్మధ 20 సంవత్సరాలు తర్వాత అక్టోబర్ 5న రీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, కాన్సెప్ట్ శింబు అందించగా ఏ. జె. మురుగన్ దర్శకత్వం వహించారు. యువన్ శంకర్ రాజా ఇచ్చిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయి.

అప్పట్లో ఈ సినిమా మ్యూజికల్ రొమాంటిక్ కల్ట్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సాయి సుధా రాచకొండ, అజిత్ కుమార్ సింగ్, వేమూరి శ్రేయస్, రమణ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 5న రీ రిలీజ్ చేశారు.

ఈ మధ్యకాలంలో రీ రిలీజులకు ఉన్న ట్రెండ్ ఏంటో మనందరం చూస్తున్నాం. ప్రస్తుత రిలీజ్ లకు దీటుగా రీ రిలీజ్ సినిమాలు కలెక్షన్లు సునామీ సృష్టిస్తున్నాయి. అదే కోవలో ఈనెల 5న రీ రిలీజ్ అయిన మన్మధ సినిమా కలెక్షన్లతో దూసుకుపోతోంది. శింబు, జ్యోతిక క్రేజ్ మామూలుగా లేదు.

IMG 20241006 WA0129

యువన్ శంకర్ రాజా అందించిన పాటలు ఇప్పటికి కొత్తగా ట్రెండ్ అవుతున్నాయి. జనరేషన్ తో సంబంధం లేకుండా ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టుగా అప్పటి సినిమాల్ని కూడా ఇప్పుడు ట్రెండ్ కు తగ్గట్టుగా చూస్తున్నారు ఆడియన్స్. రీ రిలీజ్ లో కూడా ఇంత పెద్ద విజయం అందించిన ప్రేక్షకులకి శింబు అభిమానులకి, జ్యోతిక అభిమానులకి, యంగ్ మాస్ట్రో యువ శంకర్ రాజా అభిమానులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు.

IMG 20241006 WA0133

నటీనటులు :

శింబు, జ్యోతిక, సింధు తొలని, మందిరా బేడి, యానాగుప్త, అతుల్ కులకర్ణి, అర్జు గోవిత్రిక తదితరులు

టెక్నీషియన్స్ :

సినిమాటోగ్రఫీ : ఆర్. డి. రాజశేఖర్,సంగీతం : యువన్ శంకర్ రాజా,కథ, స్క్రీన్ ప్లే, కాన్సెప్ట్ : శింబు,దర్శకత్వం : ఏ. జే., మురుగన్, ప్రపంచవ్యాప్త పంపిణీదారులు : సాయి సుధా రాచకొండ, అజిత్ కుమార్ సింగ్, వేమూరి శ్రేయస్, రమణ,డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం,పి ఆర్ ఓ : మధు VR

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *