‘రీల్ పెట్టు – చీర పట్టు’ అంటున్న ‘లగ్గం’ మూవీ టీమ్! 

IMG 20241008 WA0052 e1728381043406

సుబిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహిస్తున్నారు.

లగ్గం చిత్ర యూనిట్ వినూత్నంగా ప్రమోషన్స్ లో దూసుకెళుతోంది… ఈ క్రమంలో లగ్గం చీరల పండుగ పేరుతో రీల్ పెట్టు – చీర పట్టు అనే కార్యక్రమంకు శ్రీకారం చుట్టారు.

ఆసక్తి కలిగిన యువకులు ఇన్స్టాగ్రామ్ లో లగ్గం సినిమాకు సంభందించి పాటలకు గానీ లేదా టీజర్ లో డైలాగ్స్ కు గాని తమ స్టైల్ లో రీల్ లేదా యూట్యూబ్ షాట్ చేసి 8885050729 నెంబర్ కు పంపితే చీర ను గిఫ్ట్ గా పొందవచ్చు…

IMG 20241008 WA0117

అలాగే రీల్ ను తప్పకుండా వారి అకౌంట్ లో పోస్ట్ చేసి లగ్గం పేజీ కి టాక్ చెయ్యాలి, బహుమతులు అందచేయడానికి లగ్గం యూనిట్ సిద్ధంగా ఉంది.

ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా. చిత్రంలో నటీనటులు పూర్తి తెలంగాణ యాస మాట్లాడకుండా వాడుక భాషలో మాట్లాడుతారు. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుంది. ఇది లగ్గం నామ సంవత్సరం కాబోతుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేశాడు.

ఇటీవల విడుదలైన టీజర్ కు, పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లగ్గం సినిమా అక్టోబర్ 25న వరల్డ్ వైడ్ ఏషియన్ సురేష్ ద్వారా గ్రాండుగా విడుదల కాబోతోంది.

IMG 20241008 WA0119

నటీనటులు:

సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్, రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య గంధం, టి. సుగుణ ,లక్ష్మణ్ మీసాల, ప్రభావతి. కంచరపాలెం రాజు, ప్రభాస్ శ్రీను, సత్య ఏలేశ్వరం, అంజిబాబు, రాదండి సదానందం, కిరీటి, రవి వర్మ, వివా రెడ్డి తదితరులు ప్రముఖ పాత్ర పోషించారు.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రానికి కథ – మాటలు – స్క్రీన్ ప్లే- దర్శకత్వం రమేశ్ చెప్పాల, నిర్మాత: వేణుగోపాల్ రెడ్డి,నేపధ్య సంగీతం: మణిశర్మ, కెమెరామెన్: బాల్ రెడ్డి.  సంగీతం:చరణ్ అర్జున్. ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి. కొరియోగ్రఫీ. అజయ్ శివశంకర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *