మారిశెట్టి అఖిల్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం!

marisetty aKHIL new movie 2 e1738752660586

హీరో కావాలన్న తన తనయుడు మారిశెట్టి అఖిల్ అభిరుచిని గమనించి, అతనిని హీరోగా పరిచయం చేసేందుకు పూనుకున్నారు అనకాపల్లి జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయవేత్త మారిశెట్టి శ్రీకాంత్.

మారిశెట్టి అఖిల్ హీరోగా, భానుశ్రీ హీరోయిన్ గా శ్రీధన్ దర్శకత్వంలో ఎ.కె. టెక్ మార్కెటింగ్ మూవీ క్రియేషన్స్ పతాకంపై మారిశెట్టి శ్రీకాంత్. నిర్మించే నూతన చిత్రం చిత్రీకరణ మంగళవారం సాయంత్రం అనకాపల్లి జిల్లా చోడవరం మండలం లోని నిర్మాత సొంత గ్రామమైన లక్ష్మీపురంలోని రామాలయంలో ప్రారంభమైంది.

marisetty aKHIL new movie

టైటిల్ నిర్ణయించాల్సిన ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నిర్మాత నట్టి కుమార్ క్లాప్ నిచ్చిన అనంతరం మాట్లాడుతూ: సినిమా పరిశ్రమ ఆంధ్ర ప్రదేశ్ కు తరలి రావాలని, షూటింగులు ఆంధ్ర ప్రదేశ్ లో చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆకాంక్షించారో అందుకు అనుగుణంగా చిన్న సినిమా నిర్మాతలు ఆంధ్ర ప్రదేశ్ కు తరలివచ్చి, షూటింగు లు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అలా వచ్చిన నిర్మాతలకు సింగిల్ విండో సిస్టంలో పర్మిషన్ లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదా?. తెలియజేయాలని కోరుతున్నాను. టూరిజం లొకేషన్స్ ను మరింతగా అభివృద్ధి చేయాలి.

పాడేరు, అరకు, విశాఖ వంటి తదితర లొకేషన్స్ లో షూటింగ్ లకు అనువైన లొకేషన్స్ ను గుర్తించి, వాటి అభివృద్ధితో పాటు నిర్మాతలకు అక్కడ షూటింగులు చేసుకునేందుకు సింగిల్ విండో సిస్టమ్ కింద త్వరితగతిన అనుమతులు ఇవ్వాలి. చిన్న సినిమాల మనుగడకు తగిన చర్యలను తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారిని, ఐటీ మంత్రి నారా లోకేష్ గారిని, సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారిని కోరుతున్నాను.

అనకాపల్లి రాజకీయాలలో మంచి పేరున్న మారిశెట్టి శ్రీకాంత్ గారు తన కుమారుడి ఆసక్తిని గమనించి, సినిమా నిర్మాణానికి పూనుకోవడం అభినందనీయం” అని అన్నారు.

marisetty aKHIL new movie 1

నిర్మాత మారిశెట్టి శ్రీకాంత్. మాట్లాడుతూ: “ఈ చిత్రం చిత్రీకరణ ఈ చుట్టు పక్కల ఐదు రోజులపాటు జరుగుతుంది. ఇందులో భాగంగా ఒక పాట, ఒక ఫైట్ చిత్రీకరణ జరుపుతాం. ఆ తర్వాత హైదరాబాద్, విశాఖపట్నం, అరకు తదితర ప్రదేశాలలో షూటింగ్ చేస్తాం. హైదరాబాద్ లో పెట్టబోయే ప్రెస్ మీట్ లో మిగిలిన అన్ని విషయాలను వెల్లడిస్తాం” అని చెప్పారు.

హీరో మారిశెట్టి అఖిల్ మాట్లాడుతూ: “మొదట్నుంచి నాకు సినిమా రంగమంటే ఎనలేని మక్కువ. హీరో కావాలన్న నా అభిరుచికి మా నాన్న గారు మద్దతు పలికారు. దాంతో నా నటనకు మెరుగులు దిద్దుకునేందుకు హైదరాబాద్ లోని అన్నపూర్ణా ఫిలిం యాక్టింగ్ స్కూల్ లో నటనలో శిక్షణ పొందాను. తప్పకుండా ఈ తొలి చిత్రం నా కెరీర్ ను మలుపు తిప్పుతుందని భావిస్తున్నాను” అని అన్నారు.

దర్శకుడు శ్రీధన్ మాట్లాడుతూ:  ప్రేమకధా చిత్రమిది, హారర్ , కామెడీ అంశాలతో వైవిధ్యంగా దీనిని మలచబోతున్నామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *