ప్రభుదేవ, కాజోల్ కాంబినేషన్‌ పాన్ ఇండియా సినిమాతో దర్శకుడు గా  తేజ్ ఉప్పలపాటి !

IMG 20240524 WA0150 e1716557879915

ప్రముఖ తెలుగుచిత్ర నిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి అద్భుతమైన ప్రతిభతో బాలీవుడ్‌‌లో అడుగు పెట్టాడు. కొత్త ఉత్సాహంతో బీటౌన్‌ లో సత్తా చాటడానికి రంగం సిద్దం చేసుకున్నాడు.

తాజాగా చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ నటులు కాజోల్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

IMG 20240524 WA0144

వీరితో పాటు ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో స్టార్ కాస్టింగ్ నసీరుద్దీన్ షా, సంయుక్త మీనన్, జిషు సేన్ గుప్తా, ఆదిత్య సీల్ తదితరలు భాగస్వామ్యం అయ్యారు.

ప్రభుదేవ, కాజోల్ కాంబినేషన్‌లో 27 సంవత్సరాల క్రితం మెరుపుకలలు అనే చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇన్నాళ్ల తరువాత మళ్లీ వీరి కలయికలో వస్తున్న సినిమా అంటే ప్రేక్షకులకు చాలా ఉత్సాహం ఉంటుంది.

IMG 20240524 WA00861

ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ మేకర్స్ ఓ విషయాన్ని వెల్లడించారు. ఈ మాస్ ఎంటర్ టైనర్ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ సైతం పూర్తయిందని తెలిపారు. అతి త్వరలోనే ఈ మూవీకి నుంచి టీజర్ విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపోందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అందరూ టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన జికె విష్ణు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

అలాగే ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ యానిమల్ మూవీకి పనిచేసిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి ఎడిటర్‌గా పనిచేసిన నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

IMG 20240524 WA0145

అంతే కాదు మై నేమ్ ఈజ్ ఖాన్, వేక్ అప్ సిద్ చిత్రాలతో ప్రసిద్ది గాంచిన నిరంజన్ అయ్యంగార్, జెస్సికా ఖురానా ఈ మూవీకి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా సాహి సురేష్ పనిచేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి మరిన్ని విషయాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *