పాయల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన  ‘రక్షణ’ గ్రాండ్ రిలీజ్ ఎప్పుడంటే !

rakshana Movie psoter scaled e1716813837512

‘Rx100’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో తనదైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన పాత్ర‌ల‌కు భిన్నంగా..ప‌వ‌ర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ ‘రక్షణ’. రోష‌న్‌, మాన‌స్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా ర‌క్ష‌ణ చిత్రం మెప్పించ‌నుంది.

రీసెంట్‌గా విడుద‌లైన ఈ టీజ‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. హ‌రిప్రియ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 7న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా

ద‌ర్శ‌క నిర్మాత ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ మాట్లాడుతూ ‘‘‘రక్షణ’ టీజ‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తుంది. ఇదొక ఓ క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా. పాయిల్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన ఘటన స్పూర్తితో రాసిన కథతో సినిమా రూపొందింది. ఏ దశలోనూ రాజీ పడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కించాం. ఈ సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌ను జూన్ 7న విడుద‌ల చేస్తున్నాం’’ అన్నారు.

rakshana Movie psoter 1

న‌టీన‌టులు:

పాయ‌ల్ రాజ్‌పుత్‌, రోష‌న్‌, మాన‌స్‌, రాజీవ్ క‌న‌కాల‌, వినోద్ బాల‌, శివ‌న్నారాయ‌ణ త‌దిత‌రులు..,

సాంకేతిక వ‌ర్గం:

దర్శకుడు: ప్రణదీప్ ఠాకోర్, నిర్మాత: ప్రణదీప్ ఠాకోర్ , నిర్మాణ సంస్థ: హరిప్రియ క్రియేషన్స్, ఛాయాగ్రహణం: అనిల్ బండారి, సంగీతం: మహతి సాగర్, సౌండ్ డిజైనర్: జె.ఆర్. ఎతిరాజ్, ఎడిటర్: గ్యారి బి హెచ్, స్టంట్స్: వెంకట్ మాస్టర్, ప్రొడక్షన్ డిజైన్: రాజీవ్ నాయర్, రైటర్: తయనిధి శివకుమార్, స్టిల్స్:ఎ. దాస్, పబ్లిసిటీ డిజైనర్: రమాకాంత్, వీఎఫ్ఎక్స్: అలగర్‌సామి, ,మయాన్- ప్రదీప్ పుడి, కోడైరెక్టర్: రాఘవేంద్ర శ్రీనివాస, పి.ఆర్‌.ఒ: నాయుడు సురేంద్రకుమార్, ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: ప్రకాష్ జోసెఫ్, రమేష్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: శరద్ వాఘ్రే, ప్రొడక్షన్ కంట్రోలర్: శ్రీనివాస్ కమ్మెల, కాస్ట్యూమ్స్: శ్రీను కనుమోలు, మేకప్: కోటి లకావత్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *