పద్మవిభూషణ్ అవార్డు రావడానికి తోర్పడిన అందరికీ పేరు పేరునా థాంక్స్ – మెగాస్టార్ చిరంజీవి

chiru padma awards e1715397400703

ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డును స్వీకరించారు. కార్యక్రమం అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంకు చేరుకున్నారు.

chiru padma awards 1

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘పద్మవిభూషణ్ అవార్డు రావటం చాలా సంతోషంగా ఉంది. నాతో సినిమాలు చేసిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల కారణంగా నాకు ఈ అవార్డు వచ్చింది. అలాగే అభిమానుల అండదండలు ఎప్పుడూ మరచిపోలేను. అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు.

chiru padma awards 3

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల గురించి మాట్లాడాలంటే నేను ఏ పార్టీలో లేను. పిఠాపురంలో నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకుంటున్నాను. పవన్‌‌కు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి నేను వెళ్లటం లేదు. పవన్ నాకు ఆ కంఫర్ట్ ఇచ్చాడు. అలాగే పవన్ కూడా నన్ను ప్రచారానికి రావాలని ఎప్పుడూ అడగలేదు’’ అన్నారు.

chiru padma awards 4

సీనియర్ ఎన్టీఆర్‌కు ప్రతిష్టాత్మకమైన భారతరత్న వస్తే సంతోషంగా ఉంటుంది. ప్రభుత్వ సహకారంతో అది త్వరగా రావాలని కోరుకుంటున్నాను’ అని చిరంజీవి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *