నాగశౌర్య కొత్త సినిమా దర్శకుడు ఎవరో తెలుసా!

IMG 20240810 WA0033 e1723289534560

హీరో నాగ శౌర్య తన నూతన చిత్రాన్ని అనౌన్స్ చేశారు. డెబ్యుటెంట్ రామ్ దేశిన (రమేష్) దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని శ్రీ వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై న్యూకమ్మర్ శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ఈ నూతన చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు ప్రారంభమైయింది.

IMG 20240810 WA0030

 

డైరెక్టర్ రమేష్, ప్రముఖ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, వైవిఎస్ చౌద, శ్రీను వైట్ల వద్ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారు. అనేక విజయవంతమైన చిత్రాలకు సహ రచయితగా పనిచేశారు.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రంలో సముద్రఖని, రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్‌కుమార్‌లతో సహా ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

IMG 20240810 WA0034

 

ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ డీవోపీగా పనిచేస్తుండగా హారిస్ జయరాజ్ తెలుగు సినిమాకి కంబ్యాక్ ఇస్తూ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను రాజీవ్ నాయర్ పర్యవేక్షించగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా పని చేస్తున్నారు.

నటీనటులు:

నాగ శౌర్య, సముద్రఖని, రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, పృథ్వి, అజయ్, ప్రియ, నెల్లూరు సుదర్శన్, కృష్ణుడు, చమక్ చంద్ర, శివన్నారాయణ

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: రామ్ దేశిన (రమేష్), నిర్మాత: శ్రీనివాసరావు చింతలపూడి, బ్యానర్: శ్రీ వైష్ణవి ఫిల్మ్స్, డీవోపీ: రసూల్ ఎల్లోర్, సంగీతం: హారిస్ జైరాజ్, ఆర్ట్: రాజీవ్ నాయర్ఎ డిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, పృథ్వీ, కొరియోగ్రాఫర్లు: రాజు సుందరం, ప్రేమ్ రక్షిత్, VJ శేఖర్, శోబి పాల్రాజ్, లిరిక్స్: చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, కృష్ణకాంత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్: సుధాకర్ వినుకొండ, పీఆర్వో: వంశీ-శేఖర్.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *