“ధూం ధాం” మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మల్లెపూల టాక్సీ..’ లిరికల్ సాంగ్ విడుదల !

IMG 20240605 WA0063 e1717587033762

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం“. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు.

IMG 20240605 WA0093 1

“ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

IMG 20240605 WA0092

ఈ రోజు “ధూం ధాం” సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘మల్లెపూల టాక్సీ..’ రిలీజ్ చేశారు. మల్లెపూల టాక్సీ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా..గోపీ సుందర్ క్యాచీ బీట్ తో కంపోజ్ చేశారు. గాయని మంగ్లీ ఈ పాటను ఎనర్జిటిక్ గా పాడటమే కాదు లిరికల్ వీడియోలో స్టెప్స్ వేసి ఆకట్టుకుంది. పెళ్లి నేపథ్యంగా ఈ పాటను కలర్ పుల్ గా పిక్చరైజ్ చేశారు.

IMG 20240605 WA0090

‘నూటొక్క జిల్లాల అందగాడే మా ఇంటి పిల్లకు నచ్చినాడే…ఎన్నెల్లో ముంచిన చందురుడే మా పిల్ల కోసమే పుట్టినాడే..బుగ్గ చుక్క పెట్టుకున్న అందాల చందాల బంతిరెక్క ఎరికోరి సరైనోడినే ఎంచుకున్నాదే ఎంచక్కా.. పెండ్లి పిల్ల, పిల్లగాడి జోడి అదిరెనే…ఈ ఇద్దరి జంట చూసినోళ్ల కళ్లు చెదిరెనే..నువ్వు మల్లెపూల టాక్సీ తేరే మల్లేశా..పిల్లదాన్ని అత్తింటికి తీసుకపోరా మల్లేశా..’ అంటూ సాగుతుందీ పాట.

నటీనటులు:

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులు

టెక్నికల్ టీమ్: 

డైలాగ్స్ – ప్రవీణ్ వర్మ, కొరియోగ్రఫీ – విజయ్ బిన్ని, భాను, లిరిక్స్ – సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి, ఫైట్స్ – రియల్ సతీష్, పబ్లిసిటీ డిజైనర్స్ – అనిల్, భాను, ఆర్ట్ డైరెక్టర్ – రఘు కులకర్ణి, ఎడిటింగ్ – అమర్ రెడ్డి కుడుముల,  సినిమాటోగ్రఫీ – సిద్ధార్థ్ రామస్వామి, మ్యూజిక్ – గోపీ సుందర్, స్టోరీ స్క్రీన్ ప్లే – గోపీ మోహన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – శివ కుమార్, పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా, ప్రొడ్యూసర్ – ఎంఎస్ రామ్ కుమార్, డైరెక్టర్ – సాయి కిషోర్ మచ్చా.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *