ది బర్త్‌డే బాయ్‌ సక్సెస్ మీట్ లో భరత్‌, విస్కీ ఏమన్నారంటే ! 

IMG 20240720 WA0201 e1721474115184

 రవికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌క‌న‌కాల, ప్ర‌మోదిని, వాకా మ‌ని, రాజా అశోక్‌, వెంక‌టేష్, సాయి అరుణ్‌, రాహుల్ ముఖ్య‌పాత్ర‌ల్లో నటించిన చిత్రం ‘ది బర్త్‌డే బాయ్‌’ఈ చిత్రాన్ని బొమ్మ బొరుసా ప‌తాకంపై ఐ.భరత్‌ నిర్మించారు.

ఈ చిత్రానికి విస్కి ద‌ర్శ‌కుడు కాగా జూలై 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. దర్శకుడి జీవితంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మంచి మౌత్‌ టాక్‌తో, క్రిటిక్స్‌ అభినందనలతో ముందుకు సాగుతున్న ఈ చిత్రం థ్యాంక్స్‌ మీట్‌ శనివారం జరిగింది. ఈసందర్భంగా

IMG 20240720 WA0203

నిర్మాత భరత్‌ మాట్లాడుతూ:– ఈ సందర్భంగా నాకు సపోర్ట్‌ చేసిన నా స్నేహితులకు, నా ఫ్యామిలీకి థ్యాంక్స్‌. రాహుల్‌ మాచినేని అనే సూపర్‌ కెమెరామెన్‌ ఈ సినిమాకు దొరికారు. ఆయన ప్రతిభ సినిమాలో కనిపించింది.

సంగీత దర్శకుడు ప్రశాంత్‌కు కూడా ఈ సినిమాతో మంచి పేరు వచ్చింది. విస్కి వల్లే ఈ రోజు సినిమాకు ఈ రోజు ఇంత మంచి టాక్‌ వచ్చింది. కామన్‌ ఆడియన్స్‌ నుండి చాలా మంచి స్పందన వస్తోంది. సింక్‌ సౌండ్‌ అనేది సినిమా విజయంలో ఎంత కీలకంగా అనిపించింది.ఈ సినిమాలో నటించిన నటీనటులు కొత్తవారైనా బాగా నటించారు.

రవికృష్ణ, రాజీవ్‌ కనకాల నటన గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమా అంటే, థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ అంటే ఇష్టంతో, నిజాయితీగా సినిమా చేశాం. తప్పకుండా అందరూ ఈ సినిమాను థియేటర్‌లో చూసి ఎంజాయ్‌ చేయండి.

IMG 20240720 WA0202

దర్శకుడు విస్కి మాట్లాడుతూ:- ‘ఈ సినిమా సక్సెస్‌ క్రెడిట్‌ మా నటీనటులదే. చిన్నసినిమా గురించి ఎవరూ మాట్లాడుకోరు. కానీ మా సినిమా మంచి బజ్‌ క్రియేట్‌ చేసింది. మీరు మౌత్‌టాక్‌ తెలుసుకుని సినిమాకు వెళ్లండి. సినిమా థియేటర్స్‌ తిరిగి స్పందన తెలుసుకుంటున్నాం. అందరూ చాలా బాగా తీశారు అని మెచ్చుకుంటున్నారు.

IMG 20240720 WA0200

నేను నా వాస్తవ జీవితంలో జరిగిన ఈ సంఘటనను థియేటర్‌లో ఆడియన్స్‌ కూడా ఫీల్‌ అవ్వాలనే వుద్దేశంతో సినిమాను చాలా సహజంగా తీశాను. ఇదొక కాన్సెప్ట్‌ ఫిలిం. ఇది అందరికి రీచ్‌ అయ్యేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. నిజాయితీగా ఈ సినిమా తీశాను. సొంతంగా విడుదల చేశాం. మీరు సినిమా చూసి నచ్చితే నలుగురికి చెప్పండి.

ఎటువంటి నేపథ్యం లేకుండా అందరం కొత్తవాళ్లం కలిసి ప్రయత్నించాం. ఆడియన్స్‌ ఆదరిస్తున్నారు. తప్పకుండా సినిమా చూడాని వాళ్లు చూసి మమ్ములను ఎంకరేజ్‌ చేయండి అని చిత్ర నటీనటులు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *