డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా “కలి” మూవీ ట్రైలర్ !మూవీ రిలీజ్ ఎప్పుడంటే!

IMG 20240925 WA01461 e1727263027377

యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా “కలి“. ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు రచించి దర్శకత్వం వహిస్తున్నారు.

లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “కలి” మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ సందర్భంగా

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ – “కలి” మూవీ ట్రైలర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. ట్రైలర్ థ్రిల్లింగ్ గా అనిపించింది. గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ గా సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ తో తెలుస్తోంది. టీమ్ అంతా మంచి ఎఫర్ట్స్ పెట్టి చేశారు. వీఎఫ్ఎక్స్ హై క్వాలిటీతో ఉన్నాయి. లీడ్ యాక్టర్స్ ప్రిన్స్, నరేష్ అగస్త్య, నేహా కృష్ణన్ బాగా నటించారు.

డైరెక్టర్ శి‌వ శేషు, ప్రొడ్యూసర్ లీలా గౌతమ్ వర్మ, మిగతా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అక్టోబర్ 4న “కలి” సినిమా థియేటర్స్ లోకి వస్తోంది. మీరంతా ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నా. “కలి” మూవీ చూసేందుకు నేనూ వెయిట్ చేస్తున్నా. అన్నారు.

IMG 20240925 WA0142

“కలి” మూవీ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే – శివరామ్ (ప్రిన్స్) మంచి వ్యక్తిత్వం ఉన్న పర్సన్. అతని మంచితనం వల్లే ఇబ్బందులు పడుతుంటాడు. ‘నువ్వు మంచివాడివే కానీ.. కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో నీకు తెలియదంటూ’ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వాళ్ల పాపను తీసుకుని వెళ్లిపోతుంది.

ఈ కష్టాలతో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమవుతాడు శివరామ్. ఆ రాత్రి అతని ఇంటికి ఓ అపరిచిత వ్యక్తి (నరేష్ అగస్త్య) వస్తాడు. ఈ వ్యక్తి ఎవరు, అతను వచ్చాక శివరామ్ జీవితంలో ఎదురైన అనూహ్య ఘటనలు ఏంటి అనే అంశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ప్రియదర్శి వాయిస్ ఓ‌వర్ నవ్వించింది.

‘మనిషి పుట్టడంతోనే జీవితం అనే శత్రువును వెంటేసుకుని మరీ పుడతాడు. దాని మీద గెలిచినోడే గొప్పోడవుతాడు. ఓడినోడు మధ్యలోనే…’ అనే డైలాగ్ “కలి” కథలోని సోల్ ను చెప్పింది. అద్భుతమైన వీఎఫ్ఎక్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కాబోతున్నాయి.

IMG 20240925 WA01471

అక్టోబర్ 4వ తేదీ నుంచి “కలి” సినిమా థ్రిల్లింగ్ థియేట్రికల్ ఎక్సీపిరియన్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

నటీనటులు:

ప్రిన్స్, నరేష్ అగస్త్య, నేహా కృష్ణన్, గౌతంరాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, మని చందన, మధుమణి. తదితరులు.

టెక్నికల్ టీమ్:

సంగీతం – జీవన్ బాబు,ఎడిటర్ – విజయ్ కట్స్., సినిమాటోగ్రఫీ – నిషాంత్ కటారి, రమణ జాగర్లమూడి.,పాటలు – సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి,క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ – రాధాకృష్ణ తాతినేని, ధరణి కుమార్ టీఆర్ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఫణీంద్రపీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), సమర్పణ – కె. రాఘవేంద్ర రెడ్డినిర్మాత – లీలా గౌతమ్ వర్మ,,రచన, దర్శకత్వం – శివ శేషు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *