“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” చిత్ర సక్సెస్ మీట్ లో  విశ్వక్ సేన్, కృష్ణ చైతన్య ఏమన్నారంటే !

gangs of Gadavari success meet1 e1717210128391

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటించారు.

ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. భారీ అంచనాలతో మే 31వ తేదీన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని వర్గాల నుంచి ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన స్పందన వస్తోంది. కథా నేపథ్యం కొత్తగా ఉందని, ఎమోషనల్ సన్నివేశాలు కట్టిపడేశాయని ప్రేక్షకులు చెబుతున్నారు.

gangs of gadavari success meet 2

ఈ నేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన కథానాయకుడు విశ్వక్ సేన్, దర్శకుడు కృష్ణ చైతన్య తమ సంతోషాన్ని పంచుకున్నారు.

gangs of gadavari success meet 3

విశ్వక్ సేన్:

తెలుగు ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలను ఆదరించడంలో ఎప్పుడూ ముందుంటారు. దేశంలోనే వసూళ్ల పరంగా మనం ముందున్నాం. అయితే కొన్ని రోజులుగా థియేటర్ల దగ్గర సందడి లేదు. కొంత విరామం తరువాత మళ్ళీ మా సినిమా కోసం ప్రేక్షకులు థియేటర్ల బాట పట్టడం ఎంతో ఆనందంగా ఉంది.

సినిమా చూసి నిజాయితీగా రివ్యూ ఇవ్వడంలో తప్పులేదు. కానీ కొందరు సినిమా చూడకుండానే రివ్యూ రాస్తున్నారు. మరికొందరైతే కావాలని నెగటివ్ రివ్యూలు రాస్తున్నారు. అలాంటి రివ్యూలను పట్టించుకోకుండా.. ఎందరో ప్రేక్షకులు సినిమాలు చూడటానికి ముందుకొస్తున్నారు.

gangs of Gadavari success meet3

‘గామి’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఇలా విశ్వక్ సేన్ సినిమాల ఎంపిక వైవిధ్యంగా ఉందని ప్రశంసలు రావడం ఆనందంగా ఉంది. ఏదైనా ఛాలెంజింగ్ గా ఉంటేనే చేస్తాను. ఇక ముందు కూడా ఇలాగే ప్రేక్షకులకు కొత్తదనం ఉన్న సినిమాలను అందిస్తానని తెలుపుతున్నాను.

సినిమాకి వస్తున్న స్పందన పట్ల చాలా హ్యాపీగా ఉన్నాము. త్వరలో సక్సెస్ మీట్ ను నిర్వహిస్తాము.

gangs of gadavari success meet 1

కృష్ణ చైతన్య:

 ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. యువత యాక్షన్ సన్నివేశాలను, డైలాగ్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుంది. సెకండాఫ్ లో ఎమోషనల్ సన్నివేశాలను బాగా కనెక్ట్ అయ్యామని చెబుతుంటే.. ఎంతో సంతోషం కలిగింది.

బాలకృష్ణ గారు, వారి కుటుంబం సినిమా చాలా బాగుందని అభినందించడం.. మాటల్లో చెప్పలేని ఆనందాన్ని కలిగించింది.

gangs of Gadavari success meet

అన్ని ఏరియాలకు చెందిన డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఫోన్లు రావడం హ్యాపీగా ఉంది. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని, మంచి వసూళ్లు వస్తున్నాయని ఎందరో డిస్ట్రిబ్యూటర్లు ఫోన్లు చేసి తెలిపారు.

 ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రానికి సీక్వెల్ ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తాము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *