ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే  !

aa e1724070353949

క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. రావు రమేష్ కథానాయకుడిగా రూపొందిన చిత్రమిది. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు.

రావు రమేష్ సరసన ఇంద్రజ… అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు. ఆగస్టు 23న సినిమా విడుదల కానుంది. ఈ బుధవారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ఆగస్టు 21న హైదరాబాద్‌లో ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ను సుకుమార్, తబిత దంపతులు చూశారు. వినోదంతో పాటు చక్కటి కుటుంబ విలువలతో తెరకెక్కిన ఈ సినిమా విపరీతంగా నచ్చడంతో తన సమర్పణలో విడుదల చేయడానికి తబిత ముందుకు వచ్చారు.

Ankith sspecial Interview 7

‘మారుతి నగర్ సుబ్రమణ్యం’లో రావు రమేష్, అంకిత్ కొయ్య తండ్రి కుమారుల పాత్రలు చేశారు. రావు రమేష్ తన తండ్రి కాదని, తాను అల్లు కుటుంబంలో పుట్టానని, అల్లు అరవింద్ తన తండ్రి – అల్లు అర్జున్ తన అన్నయ్య అనుకునే క్యారెక్టర్ చేశారు అంకిత్ కొయ్య. ప్రేమించిన అమ్మాయిని ఊహించుకుంటూ పాడుకునే పాటల్లోనూ అల్లు అర్జున్ సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ రీ క్రియేషన్ చేశారు.

రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సాహిత్యం: ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్, భాస్కరభట్ల, కళ్యాణ్ చక్రవర్తి, ఆర్ట్ డైరెక్షన్: సురేష్ భీమంగని, ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి, పీఆర్వో: పులగం చిన్నారాయణ, సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాల్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: శ్రీహరి ఉదయగిరి, క్రియేటివ్‌ హెడ్‌: గోపాల్‌ అడుసుమల్లి, సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల, నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: లక్ష్మణ్ కార్య.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *