చందు మొండేటి చేతులమీదగా ఎ స్టార్ ఈజ్ బార్న్ సినిమా నుండి సాంగ్ !

IMG 20250502 WA0288 e1746192866896

టాలీవుడ్ సినిమా పరిశ్రమ కొత్తవారికి ఎప్పుడు స్వాగతం పలుకుతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త సినిమా “ఏ స్టార్ ఈజ్ బార్న్”. వీజే సాగర్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం అందిస్తున్నారు.

సి.రవి సాగర్ & వి జె సాగర్ నిర్మాణ సారథ్యంలో సి ఆర్ ప్రొడక్షన్స్, వి జె ఫిల్మ్ ఫ్యాక్టరీ నుంచి తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా ప్రియా పాల్, నేహా శర్మ, ఊహ రెడ్డి ముగ్గురు నూతన కథానాయికలు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. క్యారక్టర్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ తో పక్కా కల్ట్ కమర్షియల్‌ ఎంటర్టైన్మెంట్ సినిమాగా రాబోతున్న ఈ సినిమా నుండి “నా గతమే” సాంగ్ ను డైరెక్టర్ చందు మొండేటి విడుదల చేశారు.

IMG 20250502 WA0285

ఈ సందర్భంగా దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ… “నా గతమే సాంగ్ బావుంది, పోస్టర్స్, ప్రోమోస్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ అయ్యి చిత్ర యూనిట్ సభ్యులందరికి మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

తెలంగాణలోని వనపర్తి, కొల్లాపూర్, సోమశిల, జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాలో 93 మంది కొత్త నటీనటులు నటిస్తుండడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తుండటం విశేషం.

త్వరలో ఈ చిత్ర టీజర్, ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే అనేక ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *