“ఆపరేషన్ రావణ్” సినిమా  డైరెక్టర్ వెంకట సత్య స్పెషల్ ఇంటర్వ్యూ !

Operation Ravana Director special Interview with 18fms e1721664969807

రక్షిత్ అట్లూరి హీరోగా రాధికా శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా “ఆపరేషన్ రావణ్”. ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య తెలుగు మరియు తమిళ బాషల్లో రూపొందిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది.

“ఆపరేషన్ రావణ్” సినిమా ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలను మా 18F మూవీస్ మీడియా ప్రతినిధి కి ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు దర్శకుడు వెంకట సత్య

– మన ఆలోచనలే మన శత్రువులు అనేది పురాణాల్లోనే ఉంది. మన ఆలోచన మనం తెలుసుకోవడమే మోక్షమని చెబుతుంటారు. యోగా, ధ్యానం చేసేది మన ఆలోచనలని నియంత్రించుకోవడానికే. మనం సాధారణంగా సినిమాల్లో మన విలన్స్ భూ ఆక్రమణలు, డ్రగ్స్ అమ్మకం వంటి తప్పుడు పనులు, దౌర్జన్యం చేస్తుంటారు. ఇవన్నీ ఆ విలన్స్ యొక్క యాక్టివిటీస్. కానీ మేము ఆ పనులకు కారణమైన ఆలోచనలను విజువల్ గా చూపిస్తున్నాం. ఒక మనిషి తప్పు చేసిన ఒప్పు చేసినా దానికి ఆ ఆలోచనే కారణం. మనం ఏ పనిచేసినా ఆ పనికి ముందు ఆలోచనల్లో సంఘర్షణ జరుగుతుంది చేద్దామా వద్దా అనేది. అలాంటి ఆలోచనలకు తెరరూపమివ్వాలనే ప్రయత్నంలో భాగంగా ఈ సినిమా రూపొందించాను.

Operation Ravana Director special Interview with 18fms 3

– మన ఇతిహాసాల్లో రామాయణం ఒక థ్రిల్లర్. శ్రీరాముడు తనకు పట్టాభిషేకం జరుగుతుంది అనగా అడవులకు వెళ్లాల్సివస్తుంది. అక్కడి నుంచి రావణుడు సీతను అపహరిస్తాడు. ఎవరు అపహరించారో తెలియదు. ఆమెను వెతుక్కుంటూ శ్రీరాముడు వెళ్తాడు. ఇలా రామాయణం థ్రిల్లర్ లా అనిపిస్తుంది. “ఆపరేషన్ రావణ్”లోనూ రామాయణం రిఫరెన్స్ తీసుకున్నాం. గరుడ్మంతుడు, రావణుడు, గుహుడు ఇలాంటి పాత్రల ఇన్సిపిరేషన్ ఉంటుంది. రామాయణంలో రావణుడు మారువేషం వేసుకుని వచ్చాడు మా మూవీలో మాస్క్ పెట్టుకుని వచ్చాడు. అందుకే టైటిల్ కు “ఆపరేషన్ రావణ్” అని పెట్టాం.

– ఇవాళ సమస్య వస్తే అబ్బాయిలు, అమ్మాయిలు ఎలా రియాక్ట్ అవుతున్నారనేది చూస్తున్నాం. ప్రేమించానని అబ్బాయి అమ్మాయికి చెబితే ఆమె ఒప్పుకోకుంటే సైకో అవుతున్నాడు, లవ్ యాక్సెప్ట్ చేశాక ఆ అమ్మాయి మరో అబ్బాయితో మాట్లాడితే సైకో అవుతున్నాడు. అసలు ఒక మనిషి సైకోగా ఎందుకు మారతాడు అనేది మా మూవీలో చూపిస్తున్నాం. స్క్రీన్ మీద మా ఐడియా ఎంతవరకు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది అనేది చూసేందుకు వెయిట్ చేస్తున్నాం. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే దైవానుగ్రహం కావాలి. ఆగస్టు 2న ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఆ డేట్ నుంచి ఈ నెల 26వ తేదీకి రిలీజ్ మార్చుకున్నాం.

Operation Ravana Director special Interview with 18fms 1

– మా అబ్బాయి రక్షిత్ ను డైరెక్ట్ చేస్తున్నా అనే విషయం నన్ను పెద్దగా ప్రభావితం చేయలేదు. రక్షిత్ ఫైట్ సీన్స్ చేసేప్పుడు మాత్రం కొంచెం భయంవేసింది. ఎక్కడైనా గాయాలు అవుతాయేమో అని భయపడ్డాను. రోప్స్ మీద నుంచి యాక్షన్ సీక్వెన్సులు చేసినప్పుడు సపోర్టింగ్ రోప్స్ పెట్టమని దగ్గరుండి జాగ్రత్తలు చెప్పా. ఫైట్ మాస్టర్ నన్ను అక్కడినుంచి పంపించి మీరు వెళ్లండి సారు మేము చూసుకుంటాం అనేవారు. రక్షిత్ బాగా నటించాడు.

రీసెంట్ గా మా మూవీ నుంచి కరుణ శ్రీ గారి ఒక పద్యం రిలీజ్ చేశాం. ఆ సాంగ్ సింగిల్ షాట్ గా రూపొందించాం. ఈ పాటలో రక్షిత్ బాగా పర్ ఫార్మ్ చేశాడు. మనం ఏదైనా ఓన్ చేసుకుని నటిస్తే స్క్రీన్ మీద ఎఫెక్టివ్ గా వస్తుంది. ఎన్టీఆర్ గారు ఎన్నో పౌరాణికాల్లో పద్యాలు పాడుతూ చేశారు. ఆయన ఎంతో ఓన్ చేసుకుని నటించాడు కాబట్టే ఆ పాటలన్నీ ఇప్పటికీ గుర్తుండిపోయాయి. శరవణ వాసుదేవన్ మా మూవీకి మంచి మ్యూజిక్ ఇచ్చారు.

Operation Ravana Director special Interview with 18fms 2

– మా చిత్రంలో రాధిక గారు కీలక పాత్ర పోషించారు. ఆమెను అప్రోచ్ అయి కథ చెప్పడమే కష్టమైంది. కానీ సెట్స్ లోకి వచ్చాక డైరెక్టర్ గా నేను చెప్పినట్లు నటించారు. హ్యాండ్ మూవ్ మెంట్స్ ఆమె ఒకలా చేసేవారు నేను మరోలా చెబితే వెంటనే చేశారు. రష్ చూసి ఎలా ఉంది మేడమ్ అని అడిగితే నేను డైరెక్టర్స్ నటిని, మీకు షాట్ నచ్చితే చాలు అనేవారు. ఆమె చేసిన అన్ని సినిమాల్లో గుర్తుండిపోయే మూవీ “ఆపరేషన్ రావణ్” అవుతుంది. రిఫరెన్స్ గా ఆమె చేసిన కొన్ని సీన్స్ చెప్పుకుంటారు. మూడు టైమ్ ఫ్రేమ్స్ లో ఆమె క్యారెక్టర్ సాగుతుంది. చరణ్ రాజ్ క్యారెక్టర్ కూడా కీలకంగా ఉంటుంది.

– నాకు బిజినెస్ ఉంది. దాన్ని ఖచ్చితంగా అంచనా వేయగలం. టీ బాగా పెడితే అది తాగేవాళ్లకు నచ్చుతుంది. కానీ సినిమా ఆర్ట్ ఫామ్. మనకు బాగా నచ్చిన ఓ పెయింటింగ్ మరొకరికి చెత్త అనిపించవచ్చు. వ్యాపారరంగంలో ఏది ఎలా చేయాలో చెప్పేవాళ్లు, సపోర్ట్ చేసేవాళ్లు ఉంటారు. కానీ సినిమా రంగంలో అలాంటి సపోర్ట్ ఉండదు. ఒకవేళ ఎవరైనా సపోర్ట్ చేసినా వాళ్లు చివరకి ఎక్కడికి తీసుకెళ్తారో మీకు తెలుసు. సినిమా తీయడం కంటే దాన్ని రిలీజ్ చేయడమే పెద్ద టాస్క్ గా మారింది.

– రాజమౌళి గారి లాంటి దర్శకులు డేర్ స్టెప్ వేసి భారీ బడ్జెట్ తో బాహుబలి , ఆర్ఆర్ఆర్ లాంటి మూవీస్ చేయకుంటే ఈ రోజు తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్లి ఆస్కార్ అందుకునేది కాదు. వందల కోట్లతో సినిమా చేసేవారున్నారు. మేము నాలుగైదు కోట్ల రూపాయలతో మూవీ చేశాం. టెక్నికల్ గా అన్ని క్రాఫ్టులు బాగా వచ్చేలా చూసుకున్నాం.

Operation Ravana Director special Interview with 18fms 4

– మా సినిమా ప్రారంభమైన గంటలోపు సైకో ఎవరన్నది కనిపెడితే ఆ ప్రేక్షకుడికి సిల్వర్ కాయిన్ ఇస్తామని ప్రకటించాం. అలా వెయ్యిమందికి సిల్వర్ కాయిన్ ఇవ్వబోతున్నాం.

నేను “ఆపరేషన్ రావణ్” సినిమాను అనుకున్న బడ్జెట్ లో అనుకున్న డేట్స్ లోపే రూపొందించాను. 30 నుంచి 40 రోజుల్లో తీయాలనుకున్నాను తీశాను. కొన్ని బుక్స్ నుంచి నేర్చుకున్న విషయాలు దర్శకుడిగా ఉపయోగపడ్డాయి. సినీ రంగం మీద ఇష్టంతోనే దర్శకుడిగా మారాను. కేవీ రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు, రాజమౌళి, హాలీవుడ్ లో స్టీవెల్ స్పీల్ బర్గ్ ..వీళ్లు నా ఫేవరేట్ డైరెక్టర్స్. ఈ సినిమా ఫలితం తర్వాత నెక్ట్ మూవీ ప్లాన్ చేస్తాను. పలాస 2తో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ అనుకుంటున్నాం. ఏడాదికి మా సంస్థ నుంచి ఒక సినిమా తప్పకుండా వస్తుంది.

 ఒకే థాంక్యు అండ్ అల్ ది బెస్ట్ వెంకట సత్య గారూ , 

   * కృష్ణ ప్రగడ. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *