ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా” ర్యాప్ సాంగ్ రిలీజ్ !

IMG 20240528 WA0237 e1716928698335

 

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “గం..గం..గణేశా“. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. “గం..గం..గణేశా” ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది.

 “గం..గం..గణేశా” నుంచి ర్యాప్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ ర్యాప్ సాంగ్ ను కంపోజ్ చేసి ప్రణవ్ చాగంటితో కలిసి పాడారు మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్. ప్రణవ్ చాగంటి లిరిక్స్ అందించారు. ఒకడిది ఘాటు ప్రేమికుడి బాధ, గడగడలాడె గాథ ఇదిరా, ఒకడిది మాట దాటలేని బాట..గెలుపసలు ఎవడిదో..అంటూ కథలోని సోల్ ను రిఫ్లెక్ట్ చేస్తూ ఈ ర్యాప్ సాంగ్ సాగింది. పర్పెక్ట్ లిరిక్స్, బీట్ తో “గం..గం..గణేశా” ర్యాప్ సాంగ్ ఆకట్టుకుంటోంది.

gam gam ganesha pre release event highlights 4

నటీనటులు :

ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, కరిష్మా, వెన్నెల కిషోర్, సత్యం రాజేశ్, జబర్దస్త్ ఇమాన్యూయల్, రాజ్ అర్జున్, తదితరులు.

టెక్నికల్ టీమ్ :

పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), కాస్ట్యూమ్ డిజైనర్ : పూజిత తాడికొండ, ఆర్ట్: కిరణ్ మామిడి, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడి, సంగీతం – చేతన్ భరద్వాజ్, లిరిక్స్ – సురేష్ బనిశెట్టి, బ్యానర్ – హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్, కొరియోగ్రఫీ: పొలాకి విజయ్, కో-ప్రొడ్యూసర్ -అనురాగ్ పర్వతనేని, నిర్మాతలు – కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి, రచన, దర్శకత్వం – ఉదయ్ శెట్టి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *