అల్లు శిరీష్ “బడ్డీ” సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఆ పిల్ల కనులే..’ రిలీజ్ ఎప్పుడంటే! 

IMG 20240514 WA0126 e1715709158559

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “బడ్డీ“. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.

శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న బడ్డీ సినిమా నుంచి ఈ రోజు ఫస్ట్ సింగిల్ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు.

IMG 20240514 WA0191

రేపు ఉదయం 10 గంటలకు ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ‘ఆ పిల్ల కనులే..’ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. హిప్ హాప్ తమీజా ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న బడ్డీ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు.

నటీనటులు:

అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్, తదితరులు..

టెక్నికల్ టీమ్:

మ్యూజిక్ – హిప్ హాప్ తమిళ, బ్యానర్ – స్టూడియో గ్రీన్ ఫిలింస్, పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), కో ప్రొడ్యూసర్ – నేహా జ్ఞానవేల్ రాజా,ప్రొడ్యూసర్ – కేఈ జ్ఞానవేల్ రాజా, అధన్ జ్ఞానవేల్ రాజా,రచన, దర్శకత్వం – శామ్ ఆంటోన్.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *