అల్లు శిరీష్ నటించిన  “బడ్డీ” మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ ఎప్పుడంటే !

allu shirish buddy stills e1721223675296

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “బడ్డీ”. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్టు 2న “బడ్డీ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఒక కొత్త అటెంప్ట్ గా “బడ్డీ” సినిమా ఉండబోతోంది. ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ అందించిన సాంగ్స్ ఇప్పటికే రిలీజై ఛాట్ బస్టర్స్ అయ్యాయి. “బడ్డీ” సినిమా ట్రైలర్ కొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇచ్చి భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆగస్టు 2న రిలీజ్ కాబోతున్న “బడ్డీ” సినిమాపై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి.

నటీనటులు:

అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్, అజ్మల్ అమీర్, ప్రిషా రాజేశ్ సింగ్, ముఖేష్ కుమార్, అలీ తదితరులు

టెక్నికల్ టీమ్: 

ఎడిటర్ – రూబెన్, సినిమాటోగ్రఫీ – కృష్ణన్ వసంత్, ఆర్ట్ డైరెక్టర్ – ఆర్ సెంథిల్, మ్యూజిక్ – హిప్ హాప్ తమిళ, బ్యానర్ – స్టూడియో గ్రీన్ ఫిలింస్, పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), కో ప్రొడ్యూసర్ – నేహా జ్ఞానవేల్ రాజా, ప్రొడ్యూసర్ – కేఈ జ్ఞానవేల్ రాజా, అధన్ జ్ఞానవేల్ రాజా, రచన, దర్శకత్వం – శామ్ ఆంటోన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *