“సత్యభామ” దర్శకుడు సుమన్ చిక్కాల స్పెషల్ ఇంటర్వ్యూ! 

IMG 20240601 WA0161 e1717247163697

 క్వీన్ ఆఫ్ మాసెస్’ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు.

“మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. ఈ నెల 7న “సత్యభామ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది.

ఈ రోజు మా 18F మూవీస్ మీడియా ప్రతినిధితో జరిగిన ఇంటర్వ్యూలో సినిమాలోని హైలైట్స్ వివరించారు దర్శకుడు సుమన్ చిక్కాల.

IMG 20240601 WA0163

* నాకు సినిమాలంటే ప్యాషన్. రైటింగ్ వైపు ఆసక్తి ఉండేది. నేను ఉద్యోగం చేస్తూనే చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించాను. కొన్ని హిట్ సినిమాలకు స్టోరీ డిస్కషన్స్ లో పాల్గొన్నాను. శశికిరణ్ నాకు మంచి మిత్రుడు. ఆయన సినిమాలకు స్క్రిప్ట్ సైడ్ వర్క్ చేశాను.

ఈ సత్యభామ సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యత నాకు అప్పగించాడు శశి. అలా ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నా. దర్శకుడిగా మారేందుకు శశి ఎంతో కష్టపడ్డాడు.

శశి సక్సెస్ నుంచి యంగ్ టాలెంట్ జర్నీ మొదలుపెట్టాలని అవురమ్ ఆర్ట్స్ స్థాపించాడు. కొందరికైనా కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వగలుగుతాం అనేది ఆయన ఆలోచన. శశి వల్లే నేను దర్శకుడిగా మారాను.

* సత్యభామ కథలో ఎమోషన్, యాక్షన్ రెండూ ఉన్నాయి. ఈ కథ రాసేప్పుడు ఇది హీరోకా హీరోయిన్ కా అనేది ఆలోచించలేదు. ఒక పర్సన్ కోసం అని రాస్తూ వచ్చాం. కథలో అమ్మాయి విక్టిమ్ గా ఉంటుంది కాబట్టి ఫీమేల్ అయితే బాగుంటుంది అనిపించింది.

satya

ఎమోషన్, యాక్షన్ రెండూ కాజల్ చేయగలరు అని నమ్మాం. ఎమోషన్ పండించడంలో తనకు మంచి పేరుంది. యాక్షన్ చేస్తే కొత్తగా ఉంటుంది. రెండింటికీ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతారని బిలీవ్ చేశాం.

* కాజల్ ఈ కథ విన్నాక వెంటనే తాను చేస్తున్నట్లు చెప్పారు. యాక్షన్ పార్ట్స్ కోసం ఆమె ఎంతో కష్టపడ్డారు. డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్సులు చేశారు. మేమంతా భయపడేవాళ్లం. ఆమెకు ఏదైనా చిన్న గాయమైనా మిగతా షూటింగ్ డిస్ట్రబ్ అవుతుందని, తను మాత్రం ధైర్యంగా స్టంట్స్ చేసింది.

satyabhama pressmeet highlights 2

*కొందరు పోలీస్ ఆఫీసర్స్ తాము టేకప్ చేసిన కేసుల విషయంలో ఎమోషనల్ గా పనిచేస్తారు. అలా “సత్యభామ” ఒక కేసు విషయంలో పర్సనల్ గా తీసుకుంటుంది, ఎమోషనల్ అవుతుంది. బాధితురాలికి న్యాయం చేసేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమవుతుంది.

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక అమ్మాయికి సాయం చేసే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కాజల్ క్యారెక్టర్ కు ప్రేక్షకులంతా కనెక్ట్ అవుతారు.

* “సత్యభామ”లో నవీన్ చంద్ర కీ రోల్ చేస్తున్నారు. కాజల్ పెయిర్ గా ఆయన కనిపిస్తారు. నవీన్ చంద్రది రైటర్ క్యారెక్టర్. కాజల్ కు సపోర్ట్ గా ఉంటారు.

కాజల్ ఒక వారం పది రోజుల షూటింగ్ తర్వాత మా టీమ్ మెంబర్ గా మారిపోయారు. తను ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయి నటించారు. మాకు కూడా ఒక స్టార్ సెట్ లోకి వస్తున్న ఫీలింగ్ ఏరోజూ కలగలేదు.

IMG 20240601 WA0162

* ఏపీలో దిశా యాప్ ఉంటుంది. తెలంగాణలో షీ సేఫ్ యాప్ ఉంది. మహిళలు తమకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఈ యాప్ లో నెంబర్ టైప్ చేసి సెండ్ చేస్తే వారి లొకేషన్ షీ టీమ్స్ కు వెళ్లిపోతుంది. వాళ్లు కాపాడేందుకు వస్తారు.

మేము సెట్ లో ఉన్నప్పుడు యాప్స్ రెస్పాండ్ అవుతాయా లేదా అని చెక్ చేసి చూశాం. మాకు షీ టీమ్స్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. “సత్యభామ” చూస్తున్నప్పుడు మహిళలు ఎవరైనా ఈ యాప్స్ గురించి తెలుసుకుని తమ లైఫ్ లో వాడితే వారికి మా సినిమా ద్వారా ఒక మెసేజ్ చేరినట్లే.

*”సత్యభామ” పూర్తిగా ఫిక్షన్ కథ. నాకు పోలీస్ డైరీస్ గురించి తెలుసుకోవడం, వారి ఇంటర్వ్యూలు వినడం అలవాటు. అలా కొందరు పోలీసుల లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ స్ఫూర్తితో ఈ కథను డెవలప్ చేశాం.

ముందు మా మూవికి ఈ పేరు లేదు. అయితే సత్యభామ అనే పేరు మన పౌరాణికాల్లో పవర్ ఫుల్ నేమ్. అందరికీ త్వరగా రీచ్ అవుతుందని ఆ పేరు పెట్టాం.

satyabhama pressmeet highlights 3

* ఈ వారం రిలీజైన సినిమాలన్నీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మూవీస్ కు టాక్ బాగుండటం హ్యాపీగా ఉంది. వాళ్ల సినిమాలు ఆడితే ప్రేక్షకులు థియేటర్స్ కు రావడానికి అలవాటు పడతారు.

నెక్ట్ వీక్ మా మూవీ థియేటర్స్ లోకి వస్తుంది కదా. “సత్యభామ”కు శ్రీచరణ్ పాకాల ఇచ్చిన మ్యూజిక్ పెద్ద అట్రాక్షన్ అవుతుంది. బీజీఎంతో ఆయన మూవీని మరో లెవెల్ కు తీసుకెళ్లారు.

* “సత్యభామ”ను పాన్ ఇండియా రిలీజ్ కు తీసుకెళ్లవచ్చు కానీ ఇది పూర్తిగా హైదరాబాద్ మూవీ. నేటివ్ సినిమా. సో దీన్ని తెలుగులో చేయడమే కరెక్ట్. ఎలాగూ ఓటీటీలో అన్ని భాషల్లో అందుబాటులోకి వస్తుంది.

IMG 20240601 WA0044

* నేను పవన్ కల్యాణ్ పంజా మూవీకి వర్క్ చేశాను. అప్పటికి ఇంకా డిజిటల్ రాలేదు. ఆ తర్వాత రెడ్ కెమెరాలు వచ్చాయి. ఇప్పుడు ఓటీటీల్లో వరల్డ్ మూవీ కంటెంట్ చూస్తున్నాం.

ఓటీటీ ప్రభావం పెరగడం వల్ల మన ఆడియెన్స్ సరికొత్త కంటెంట్ ను ఇష్టపడుతున్నారు. మన రైటర్స్, డైరెక్టర్స్ అలాంటి మూవీస్ చేసేందుకు ఒక అవకాశం కలుగుతోంది.

ప్రస్తుతం కొన్ని కథలు ఉన్నాయి. త్వరలో నా నెక్ట్ మూవీ అనౌన్స్ చేస్తా.

 ఒకే థాంక్యూ అండ్ అల్ ది బెస్ట్ సుమన్ చిక్కాల గారూ..,

    * కృష్ణ ప్రగడ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *