సంయుక్త మీనన్ నటిస్తూ సమర్పిస్తున్న  మూవీ ఓపెనింగ్ !

IMG 20241009 WA01481 e1728466689338

సక్సెస్ మారుపేరుగా హీరోయిన్ సంయుక్తను చెబుతుంటారు. ఆమె టాలీవుడ్ లో అపజయం ఎరుగని నాయికగా క్రేజ్ తెచ్చుకుంది. పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ టాలెంటెడ్ హీరోయిన్ ఇప్పుడు లీడ్ రోల్ లో యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. ఈ రియలిస్టిక్ మూవీకి యోగేశ్ దర్శకత్వం వహిస్తున్నారు.

IMG 20241009 WA01491

ఈ చిత్రానికి సంయుక్త ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. హాస్య మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో ఇంతమంది సెలబ్రిటీలు గెస్ట్ లుగా వచ్చిన ఈవెంట్ ఇదే అనుకోవచ్చు.

IMG 20241009 WA01471

సంయుక్త యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓపెనింగ్ కార్యక్రమంలో నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, హీరో రానా, దర్శకులు వశిష్ట, వెంకీ కుడుముల, రామ్ అబ్బరాజు, రచయిత కోన వెంకట్ తదితరులు పాల్గొన్నారు. సంయుక్త కెరీర్ లో ఈ సినిమా ఎంతో స్పెషల్ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *