సందడిగా “ఐ-20″పాటలు – ప్రచార చిత్రం విడుదల !

IMG 20240518 WA0316 e1716028521699

పి.ఎన్.ఆర్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఆవిష్కార్ మూవీ క్రియేషన్స్ పతాకంపై సూగూరి రవీంద్ర దర్శకత్వంలో పి.బి.మహేంద్ర నిర్మించిన న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్ “ఐ – 20”. బివేర్ ఆఫ్ గర్ల్స్ (అమ్మాయిలతో జాగ్రత్త) అనేది ఉప శీర్షిక. కొమ్ము మనోహర దేవి సహ నిర్మాత.

IMG 20240518 WA0317

సూర్యరాజ్ – మెరీనా సింగ్ జంటగా నటించిన ఈ చిత్రం పాటలు, ప్రచారచిత్రం ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదల చేశారు.ప్రముఖ ఆడియో సంస్థ మధుర ఆడియో ద్వారా ఈ చిత్రం పాటలు లభ్యం కానున్నాయి!!

IMG 20240518 WA0315

తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్.దామోదర్ ప్రసాద్, ప్రముఖ దర్శకనిర్మాత లయన్ సాయి వెంకట్, ప్రముఖ దర్శకులు వి.సముద్ర ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

ఎన్నో వ్యయప్రయాసలకోర్చి రూపొందించిన “ఐ – 20” అందరికీ నచ్చుతుందనే ఆశాభావాన్ని దర్శకనిర్మాతలు వ్యక్తం చేశారు.

IMG 20240518 WA0314

మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ యెలెందర్, గీత రచయిత దేవకరణ్, సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్, కొరియోగ్రాఫర్స్ శైలజ- శ్యామ్ తదితర చిత్రబృందం ఈ వేడుకలో పాల్గొన్నారు. రాగిణి, లీరిషా (సూపర్ ఉమెన్), చిత్రం శ్రీను, జోష్ రవి, పొట్టి చిట్టిబాబు, సద్దాం హుస్సేన్, రియాజ్, పర్శ, పల్లెమోని శ్రీనివాస్, వినోద్ నాయక్ తదితరులు ఈ చిత్రంలో ఇతర కీలకపాత్రలు పోషించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *