మేడే సందర్భంగా పడమటి కొండల్లో సినిమా నుంచి హీరోయిన్ యశస్వి శ్రీనివాస్ ఫస్ట్ లుక్ విడుదల

padamati kondallo scaled e1714588311228

శ్రీదేవి క్రియేషన్స్ బ్యానర్ పై విన్విత ఎంటర్టైన్మెంట్స్ సమర్పణ ద్వారా జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా ఈ ‘పడమటి కొండల్లో’ చిత్ర నిర్మాణం జరిగింది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన నరేష్ పెంట, సంగీతాన్ని కూడా అందించారు. ఈ సినిమాకి సంబంధించిన హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ని ఇటీవలే సాయిధరమ్ తేజ్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ యశస్వి శ్రీనివాస్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. యశస్వి శ్రీనివాస్ ఈ సినిమాలో మైన పాత్రలో కనిపించబోతున్నారు. ఎర్ర రంగు చీరలో జుట్టు విరబోసుకుని చేతిలో కత్తి పట్టుకున్న కాళీమాత లాగా ఉన్న శ్రావ్య రెడ్డి ఫస్ట్ లుక్ సినిమా పైన అంచనాలను పెంచేస్తోంది.

“పడమటి కొండల్లో” సినిమాతో సరి కొత్త ఎక్స్పీరియన్స్ ని ప్రేక్షకులు పొందుతారని, ఈ చిత్రానికి ఒక మార్క్ ఉంటుంది అని, భవిష్యత్తులో మరిన్ని అప్డేట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది.

తారాగణం:

అనురుప్ప్ కటారి, యశస్వి శ్రీనివాస్, శ్రావ్య రెడ్డి, మురళీ కృష్ణం రాజు, లతీష్ జవ్వాది, మురళీ రాజు, స్కయ్, జగదీష్ రెడ్డి, ఆర్.రాము, శివాని నీలకంఠం, భాను, ప్రసాద్, రాంబాబు, లక్కీ తదితరులు

సాంకేతిక నిపుణులు:

దర్శకుడు/సంగీతం: నరేష్ పెంట నిర్మాత: జయకృష్ణ దురుగడ్డ
సినిమాటోగ్రఫీ: కన్నన్ మునిసామి,ఎడిట‌ర్: బ‌ల్లా స‌త్య నారాయ‌ణ,స్టంట్స్: శ్రీను,సాహిత్యం: సాహిత్య సాగర్,డైలాగ్స్: ఆర్.రాము,కళ: శ్రీను,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: లతీష్ జవ్వాది,కో-డైరెక్టర్: హర్ష.కె,పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మాడూరి మధు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *