బెంగళూరు రెగ్యులర్ షూటింగ్ లో “గీతా శంకరం”

IMG 20240911 WA0152 e1726070977271

ఎస్‌.ఎస్‌.ఎం.జి ప్రొడక్షన్స్‌ పతాకంపై ముఖేష్‌గౌడ`ప్రియాంక శర్మ జంటగా రుద్ర దర్శకత్వంలో ప్రముఖ వ్యాపారవేత్త కె. దేవానంద్‌ నిర్మిస్తున్న ప్రేమకథా కావ్యం ‘గీతా శంకరం’. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ బెంగళూరులో జరుపుకుంటున్న ఈ చిత్రం రీసెంట్ గా సాంగ్స్ రికార్డింగ్ కంప్లీట్ చేసుకుంది.

ఈ సందర్భంగా నిర్మాత దేవానంద్‌ మాట్లాడుతూ… కంటెంట్ ఉంటే చిన్న చిత్రం అయినా, పెద్ద చిత్రం అయినా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ముందుగా కృతజ్ఞతలు. ఒక మంచి కంటెంట్ తో మా గీత శంకరం సినిమాని నిర్మిస్తున్నాము. ఒక ఎమోషనల్ డ్రామా తో ప్యూర్ లవ్ స్టోరీ గా జరిగే కథ ఇది.

IMG 20240911 WA0157

ఈ సినిమా ప్రస్తుతం బెంగళూరులో షెడ్యూలు జరుపుకుంటుంది. అలాగే మా చిత్రంలోని పాటలన్నిటిని రీసెంట్ గా రికార్డింగ్ చేయడం జరిగింది. ఇదొక మంచి ప్రేమకథా దృశ్య కావ్యం

. ప్రతి సన్నివేశాన్ని అత్యద్భుతంగా తెరకే క్కించడం జరుగుతుంది. త్వరలో లిరికల్ వీడియో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నాం”అన్నారు

IMG 20240911 WA0155

దర్శకుడు రుద్ర మాట్లాడుతూ… ప్రజెంట్ యూత్ సినిమా చూసే విధానం మారింది. కొత్తదనం ఉంటే పెద్ద విజయాన్ని అందిస్తున్నారు. అందుకే చాలా కొత్త పాయింట్ తో , స్క్రిప్టు లో అనేక మార్పులు చేసి ఇంకా అధ్బుతం గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం.

నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత దేవానంద్‌ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సినిమా అద్భుతంగా రావటానికి నాతోపాటు కష్టపడుతున్న ఆర్టిస్ట్‌లకు, టెక్నీషియన్స్‌కు నా కృతజ్ఞతలు. త్వరలో మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాము అని అన్నారు.

ఈ చిత్రానికి పాటలు: చంద్రబోస్‌, సంగీతం: అభు కెమెరా: శ్యామ్ ధూపాటి ఎడిటర్‌: మారుతిరావు, కొరియోగ్రాఫర్‌: ఈశ్వర్‌ పెంటి, పి.ఆర్‌.ఓ: వీరబాబు, నిర్మాత: కె. దేవానంద్‌, కథ, స్క్రీన్ ప్లే,దర్శకత్వం: రుద్ర.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *