ఫిలిం ఛాంబర్ లో ఘనంగా సర్పంచ్ మూవీ ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి!

IMG 20240503 WA0046

జ్ఞాన ఆర్ట్స్ వారి ప్రేక్షక ఫిలిమ్స్ బ్యానర్ పై జట్టి రవికుమార్ M.A. దర్శకుడిగా వ్యవహరిస్తూ నిర్మిస్తున్న చిత్రం సర్పంచ్ ప్రారంభోత్సవ వేడుకలు గురువారం  ఫిల్మ్ చాంబర్ లో ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోయినపల్లి హనుమంతరావు గారు (జాతీయ స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల జాతీయ అధ్యక్షుడు), సీతారామస్వామి ఉపాసకులు శ్రీశ్రీశ్రీ పెండ్యాల సత్యనారాయణ గారు, హైకోర్టు అడ్వకేట్ కుడికాల ఆంజనేయులు గారు, బి. రమేష్, అంజనీ, జట్టి రజిత, అక్షర జ్ఞాన, అనోగ్న, జ్ఞాన సిద్ధార్థ, అంబేద్కర్ శాస్త్రి, బంటు ప్రవీణ్, పోతరాజు, ప్రశాంత్, సంపత్, బంటు ఆశ్రిత, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

IMG 20240503 WA0048

బోయినపల్లి హనుమంతరావు మాట్లాడుతూ : మా నాన్నగారు స్వాతంత్ర సమరయోధుడు. కరీంనగర్ గాంధీగా ఆయనకు గుర్తింపు ఉంది. ఈ సినిమా రంగ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు జట్టి రవికుమార్ గారికి ధన్యవాదాలు.

ప్రేక్షక ఫిలిమ్స్ బ్యానర్ ద్వారా వస్తున్నాయి సినిమా మంచి విజయం సాధించాలని. ముందు ముందు ఈ బ్యానర్ ద్వారా ఇంకా మంచి సినిమాలు వచ్చి దిన దినాభివృద్ధి చెందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

IMG 20240503 WA0043

నిర్మాత, దర్శకుడు జట్టి రవికుమార్ మాట్లాడుతూ : మనిషిని ముందుండి నడిపించేది జ్ఞానం అందుకని జ్ఞాన ఆర్ట్స్ అని అదేవిధంగా సినిమా సక్సెస్ కి కారణం ప్రేక్షకుడు అందుకని జ్ఞాన ఆర్ట్స్ వారి ప్రేక్షక ఫిలింస్ అని పెట్టాం. ఈ సినిమాని జూన్ 20న మొదలు పెట్టి 2025 కి పూర్తి చేస్తాం. ప్రేక్షకులందరికీ ఆదరణ సపోర్ట్ మాపై ఈ సినిమాపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాణం : జ్ఞాన ఆర్ట్స్ వారి ప్రేక్షక ఫిలిమ్స్, నిర్మాత మరియు దర్శకుడు : జట్టి రవికుమార్, పి ఆర్ ఓ : మధు VR

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *