ప్రపంచవ్యాప్తంగా జూన్ 7 న ఘనంగా థియేటర్లో రాబోతున్న ఓసి మూవీ

oc movie poster e1716287385609

కౌండిన్య ప్రొడక్షన్స్ పై బీవీస్ నిర్మాతగా, విష్ణు బొంపెల్లి దర్శకత్వంలో హరీష్ బొంపెల్లి, మాన్య సలాడి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ఓసి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా సినిమాలోకి రావాలని కొంతమంది యువకుల కథే ఓసి. శరవేగంగా నిర్మాణాంతరపు పనులను పూర్తి చేసుకుంటున్న ఓసి.. జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇప్పటికే విడుదలైన ఓసి టీజర్ విశేష ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిత్ర పరిశ్రమలో స్టార్ల కొడుకులే హీరోలవుతారు అనే డైలాగ్స్ ప్రేక్షకులను ఆలోచింపజేసేలా చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని కుర్రాళ్ళు సినిమాలో రాణించారా లేదా అనేది తెలియాలంటే జూన్ 7 వరకు వేచి చూడాల్సిందే.

oc movie poster 1

మంచి నిర్మాణ విలువలతో, భారీ బడ్జెట్ తో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఓసి చిత్రాన్ని తెరకెక్కించినట్టు మేకర్స్ తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథాకథను ఉంటుందని.. థియేటర్లో చూసే వీక్షకులను ఓసి కట్టిపడేస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రానికి లక్ష్మీకిరణ్ కథ, సాయిరాం తుమ్మలపల్లి సినిమాటోగ్రఫీ అందించగా డాన్స్ మాస్టర్ సత్య కొరియోగ్రఫీ అందించగా, వంశీ ఎస్. అక్షర్ బ్యాండ్ సంగీతం సమకూరుస్తున్నారు.

ఇంతకీ ఓసి అంటే ఏంటో తెలియాలి అన్నా,  చూడాలన్నా  జూన్ 7 వరకు వేచి ఉండాల్సిందే.

నటీనటులు:

హరీష్ బొంపెల్లి, మాన్య సలాడి, రోయల్ శ్రీ, లక్ష్మీ కిరణ్ తదితరులు…,

సాంకేతిక నిపుణులు: 

దర్శకత్వం: విష్ణు బొంపెల్లి, నిర్మాత: బీవీఎస్, బ్యానర్: కౌండిన్య ప్రొడక్షన్స్, సినిమాటోగ్రఫీ: సాయిరాం తుమ్మలపల్లి, సంగీత దర్శకుడు: భోలే శివాలి, కొరియోగ్రాఫర్: సత్య మాస్టర్, పీఆర్ఓ: హరీష్, దినేష్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *