పుష్ప-2 రూమర్స్‌ పై క్లారిటి ఇచ్చిన ప్రముఖ నిర్మాత బన్నీవాస్‌ !

Pushpa Allu Arjun

‘పుష్ప-2’ ది రూల్‌ విషయంలో కథానాయకుడు అల్లు అర్జున్‌- దర్శకుడు సుకుమార్‌ పై సోషల్‌ మీడియాలో వస్తున్న రూమర్స్‌పై అల్లు అర్జున్‌ సన్నిహితుడు, ప్రముఖ నిర్మాత బన్నీవాస్‌ శుక్రవారం జరిగిన ‘ఆయ్‌’ సినిమా ప్రెస్‌మీట్‌లో స్పందించారు.

ఈ సందర్భంగా ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ‘పుష్ప-2 గురించి మీడియా లో వస్తున్న న్యూస్ లు చూసి నవ్వుకునే స్థితిలో మేమున్నాం.

అల్లు అర్జున్ షూటింగ్‌ పార్ట్ 15 నుంచి 20రోజుల లోపు ఉంది. ఇది కాకుండా వేరే ఆర్టిస్టులతో కూడా చిత్రీకరణ మిగిలి వుంది. దర్శకుడు సుకుమార్‌ ఎడిటింగ్‌ చూసుకుని ఇంకా ఏమైనా అల్లు అర్జున్‌ పార్ట్‌ బ్యాలెన్స్ వుందేమో క్లారిటీ తెచ్చుకుని షూటింగ్‌ పెట్టుకుందాం అన్నారు.

అల్లు అర్జున్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ట్రీమ్‌ చేశారు. అల్లు అర్జున్ సుకుమార్‌కు నాకు ఉన్న బాండింగ్ లైఫ్ లాంగ్ అలానే వుంటుంది. ఆగష్టు మొదటి వారంలో షూటింగ్‌ మొదలవుతుంది.

పుష్ప లాంటి పాన్ ఇండియా క్రేజీ ఫిలిం ని బన్నీ సింపుల్ గా ఎందుకు తీసుకుంటారు’ అని బన్నీ వాసు అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *