డిమోంటి కాలనీ 2 హారర్ సీక్వెల్ కి తెలుగులో ఫస్ట్ ఎవర్ స్పెషల్ ప్రీమియర్ అంట !

demanty e1723999305292

కోలీవుడ్ లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో వాటు హారర్ సినిమాలు కూడా బాక్స్ఆఫీసు దగ్గర మంచి వసూళ్లు సాదీస్తాయి. ఆ మద్య 2015 లో  అరుల్ నిధి స్టాలిన్ నటించిన డిమాంటి కాలనీ అనే సినిమా వచ్చి సక్సెస్ సొంతం చేసుకోంది.

గత కొన్నేళ్ల కితం వచ్చిన “డిమోంటి కాలనీ” హారర్ సినిమా కి  సీక్వెల్ చిత్రంగా  “డిమోంటి కాలనీ 2” ఈ నెల ఆగస్టు 15 న తమిళనాడు లో విడుదల అయ్యి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ డిమోంటి కాలనీ 2  హారర్ సీక్వెల్ ని దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించరు.

https://x.com/MythriRelease/status/1825143862521934169

ఇక ఈ చిత్రాన్ని తెలుగు డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడానికి సక్సెస్ ఫుల్ నిర్మాణ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రి డిస్ట్రిబ్యూషన్ ఎల్ ఎల్ పి తెలుగు రైట్స్ సొంతం చేసుకోగా వీరు ఈ చిత్రాన్ని గతంలో ఎప్పుడు లేని విధంగా మూడు రోజూ రోజుల ముందే ప్రీమియర్స్ కి తీసుకొస్తున్నారు.

మైత్రి డిస్ట్రిబ్యూషన్ వారు నైజాం లో డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసిన దగ్గరనుండి, తెలంగాణ లొని ఒక్కో దియేటర్ ని లీజు పద్దతిలో తీసుకొంటూం కొత్త అంగులు దుద్దుతున్నారు. రీసెంట్ గా  హైదరాబాద్ లోని బాలానగర్ లో ఉన్న విమల్ థియేటర్ ని వారు కొత్తగా రేనోవేట్ చేసి నిన్ననే మిస్టర్ బచ్చన్ మూవీ తో రి ఓపెన్ చేశారు.

demanty 1

ఆ  విమల్ థియేటర్ లో ఈ “డిమోంటి కాలనీ 2”  సినిమాని వారు ఈ మంగళవారం అంటే ఈ ఆగస్ట్ 20 నే ప్రీమియర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు.  ప్రతి సారి రిలీజ్ ముందు రోజు అంటే  గురువారం సాయంత్రం మొదలయ్యే ప్రీమియర్ ని వీరు స్పెషల్ గా మూడు రోజులు ముందే వేస్తున్నారు అని చెప్పాలి.

మరి ఈ “డిమోంటి కాలనీ 2” చిత్రం తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి. తమిళనాడు లో సక్సెస్ అందుకుంది కాబట్టి తెలుగు లో కూడా మంచి ఓపెనింగ్స్ సాధిస్తుంది అని మైత్రి వారు ధీమాగా ఉన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *