గెట్ అప్ శ్రీను నటించిన  రాజు యాదవ్: Aha OTT లో స్ట్రీమింగ్ రెడీ!

IMG 20240725 WA0108 e1721895236429

ఎప్పుడు నవ్వుతూనే ఉండే లోపం అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్టుతో యదార్థ సంఘటనల ఆధారంగా తెరికెక్కిన చిత్రం ‘రాజు యాదవ్’.

తమిళం, మలయాళం సినిమాలలో కనిపించేటువంటి సహజత్వంతో కూడుకున్న సన్నివేశాలతో మొదటి నుంచి చివరి నిమిషం వరకు కూడా ఎక్కడ సినిమాటిక్ పోకడలకి వెళ్ళకుండా చాలా రియలిస్టిక్ గా రూపొందించబడింది.

IMG 20240725 WA0107

ఎదుటి వ్యక్తి ఇష్టాయిష్టాల్ని పట్టించుకోకుండా, ప్రేమ పేరుతో వెంటపడే కొద్దిమంది ప్రేమికుల గురించి తరచూ వింటూనే ఉంటాం, కొన్నిసార్లు తమని ప్రేమించలేదని ఎదుటి వ్యక్తులపై అఘాయిత్యాలకి పాల్పడటం, మరికొన్నిసార్లు దేవదాసులుగా మారిపోవడం లాంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి.

అలాంటి అపరిపక్వమైన ఆలోచనలున్న ఓ యువకుడి ప్రేమకథగా రూపొందించిన చిత్రం. ప్రథమార్థం సినిమా అంతా కూడా కథానాయకుడు, అతని స్నేహితులు, మధ్య తరగతి జీవితం చుట్టూ సాగుతుంది. క్రికెట్ బాల్ తగిలాక కథనాయుకుడి ముఖ కవలికల్లో మార్పు రావడం, ఆ నేపథ్యంలో పండే హాస్యం కాస్త కాలక్షేపాన్ని పంచుతుంది.

ధ్వితీయార్థం లోనే అసలు కథ ఉంటుంది. తాను ప్రేమించిన అమ్మాయి కోసం కథానాయకుడు హైదరాబాద్ కి వెళ్ళి ఆమెకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించడం వంటి సన్నివేశాలతో సినిమా సాగుతుంది.

క్లైమాక్స్ లో భాగంగా వచ్చే చివరి 20 నిమిషాల సన్నివేశాలతో మధ్య తరగతి కుటుంబం తాలూకు తండ్రి కొడుకుల మధ్య ఉండే భావోద్వేగమైన ఎమోషన్ తో కంటతడి పెట్టిస్తుంది.

IMG 20240725 WA0105

https://www.aha.video/movie/raju-yadav

గెటప్ శ్రీను కెరియర్ బెస్ట్ పెర్ఫామెన్స్

గెటప్ శ్రీను నటన చిత్రానికి ప్రధానబలం. ఫేస్ మీద ఎప్పుడు నవ్వుతూ నటించడం అంటే మామూలు విషయం కాదు. ప్రథమార్థంలో నవ్వు మొహంతో కనిపిస్తూ నవ్వించిన ఆయన, ధ్వితీయార్థంలో నవ్వుతూనే భావోద్వేగాలని పండించాడు.

దర్శకుడు కృష్ణమాచారి ఒక రియల్ స్టోరీని తీసుకొని, అంతే రియలిస్టిక్ గా చూపించాడు. సినిమాలో చివరి 20 నిమిషాలు వచ్చే సన్నివేశాల్ని, ఎమోషన్ ని మలిచిన తిరుకి దర్శకుడిని తప్పకుండ అభినందిచాల్సిందే.

తారాగణం:

గెట్ అప్ శ్రీను, అంకిత కరత్, ఆనంద్ చక్రపాణి, మిర్చి హేమంత్ ..,

సాంకేతిక వర్గం:

రచయిత, దర్శకుడు: కృష్ణమాచారి , నిర్మాతలు : ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లేపల్లి సంగీతం: హర్ష వర్దన్ రామేశ్వర్, సురేశ్ బొబ్బిలి , డిఓపీ: సాయి రామ్ ఉదయ్ , ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి , డిజిటల్ ఆక్విజిషన్ పార్ట్నర్: భవాని వీడియోస్

రాజు యాదవ్ ను Aha OTT లో చూడండి, ఈ రియలిస్టిక్ కామెడీ & ఎమోషనల్ డ్రామాను అసలు మిస్ అవ్వకండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *