గద్దర్ నటించిన ఆఖరి చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’ గ్రాండ్ రిలీజ్ ఎప్పుడంటే! 

IMG 20240807 WA0142 e1723023967141

విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు నినాదం తో దర్శక, నిర్మాత హీరో జనం స్టార్ సత్యారెడ్డి నిర్మాణం లో ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్ నటించిన ఆఖరి చిత్రం,”ఉక్కు సత్యాగ్రహం ” ఈ చిత్రాన్ని ఈ నెల 30 న విడుదల చేస్తున్నారు.

జాతీయ ఉత్తమ ప్రముఖ దర్శకులు నిర్మాత బి.నర్సింగరావు. తెలంగాణా రాష్ట్ర గీతం రూపశిల్పి అందేశ్రీ, గద్దర్ తనయుడు సూర్యం, జానపద కవి గోరేటి వెంకన్న, ప్రొఫెసర్ కోదండరాం, నందిని సిద్ధారెడ్డి, అల్లం నారాయణ ప్రముఖులు సంయుక్తం గా పోస్టర్ విడుదల చేసి రిలీజ్ డేట్ నిర్ణయించి ప్రకటించారు.

గద్దరన్న మూడు పాటలు పాడి రెండు పాటల్లో మరియు కొన్ని సందేశాత్మక సీన్స్ లో నటించారు. గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ అద్భుతమైన సాహిత్యం అందించారు.

IMG 20240807 WA0141

ఈసందర్బంగా చిత్ర దర్శక, నిర్మాత, కథానాయకుడు సత్యారెడ్డి మాట్లాడుతు : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కి వ్యతిరేకంగా, భూనిర్వశితులకి న్యాయం కోసం ఉక్కు సత్యాగ్రహం సినిమాని ఒక గ్రంధంలా, కళా ఖండంలా మూడు సంవత్సరాలు పాటు ఎంతో కస్టపడి నిర్మించామని నిజమైన స్టీల్ ప్లాంట్ యూనియన్ లీడర్స్, ఎంప్లాయిస్, భూనిర్వాసితులు, ఎంతోమంది మేధావులు,కవులు కళాకారుల, రచయితలు కూడా ఈ చిత్రం లో నటించారని తెలిపారు.

ఢిల్లీ ఇండియా గేట్, జంతర్ మంతర్, ఆంధ్రప్రదేశ్ భవన్, సింగరేణి కోల్ మైన్స్, విశాఖపట్నం ప్రాంతాల్లోని వివిధ లొకేషన్ లలో షూటింగ్ చేశామని చెప్పారు. ఈ ఆగస్టు నెల 30 వ తేదిన ప్రపంచం వ్యాప్తంగా రెండు వందల దియోటర్ల పైగా విడుదల చేస్తున్నట్లు సత్యారెడ్డి తెలిపారు.

IMG 20240807 WA0143

నటీనటులు :

గద్దర్ గారు, సత్యా రెడ్డి, ‘పల్సర్ బైక్’ ఝాన్సీ, ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు, ఎం వి వి సత్యనారాయణ, ప్రసన్నకుమార్, వెన్నెల.

సాంకేతిక నిపుణులు: 

సంగీతం : శ్రీకోటి, ఎడిటర్ : మేనగ శ్రీను,, ప్రొడక్షన్ : జనం ఎంటర్టైన్మెంట్స్,కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత మరియు దర్శకత్వం : పి. సత్యా రెడ్డి,, పి ఆర్ ఓ : మధు VR.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *