ఈమె సుబ్బమ్మ ఇదియే ఈమె కథ సినిమా ప్రారంభం. ! 

IMG 20240825 WA0226 e1724590440574

  ఎం ఎం ఆర్ ఆర్ట్ క్రియేషన్స్ ప్రొడక్షన్ పతాకంపై కిరణ్ దర్శకత్వం లో ప్రొడ్యూసర్ మంద మల్లికార్జున రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ,'”ఈమె సుబ్బమ్మ ఇదియే ఈమె కథ” సినిమా నేడు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైంది

.ఈ కార్యక్రమం లో డైరెక్టర్ కిరణ్ ank, ప్రొడ్యూసర్ మంద మల్లికార్జున రెడ్డి, హీరో శ్యామ్ షెల్వన్, హీరోయిన్స హాన్విక, రితిక, గ్రీష్మ, హీరోయిన్ ఎస్తేర్,G. L. ఫనీకాంత్, తదితరులు పాల్గొన్నారు,

IMG 20240825 WA0224

డీవోపీ గాజుల శివ, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్, భాస్కర్ రెడ్డి, ఎక్సక్యూటివ్ ప్రొడ్యూసర్ మోహన్ కృష్ణ, లిరికల్ రైటర్ రాము కుంభగిరి గారు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జి ఎల్ ఫణి కాంత్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ప్రొడ్యూసర్ మంద మల్లికార్జున రెడ్డి గారు క్లాప్ కొట్టారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ కిరణ్ మాట్లాడుతూ” నేను కొత్త వాడినైనా మా నిర్మాత మల్లికార్జున్ రెడ్డి గారు ఈ కథను నమ్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఆయనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చిత్రం లవ్ స్టోరీ తో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది .

ఈ చిత్రం డెఫినెట్ గా యూత్ తో పాటు టోటల్ కుటుంబ సమేతంగా చూసే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబో తున్నాము .అని అన్నారు

IMG 20240825 WA0225

చిత్ర నిర్మాత మంద మల్లికార్జున్రెడ్డి మాట్లాడుతూ ఈ చిత్రం కథ విన్న వెంటనే చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. ఈ చిత్రం డెఫినేట్ గా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది.

సెప్టెంబర్ ఫస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభించనున్నాం అని అన్నారు.

IMG 20240825 WA0223

సాంకేతిక వర్గం: 

సంగీతం: చరణ్ అర్జున్, డి ఓ పి: గాజుల శివ,నిర్మాత :మంద మల్లికార్జున్రెడ్డి, దర్శకత్వం: కిరణ్ ANK.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *