‘ఆటిట్యూడ్ స్టార్’ చంద్రహాస్ “రామ్ నగర్ బన్నీ” సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ !

RAm nagar bunny movie 5 e1725850985579

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా “రామ్ నగర్ బన్నీ”. విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్నారు.

అక్టోబర్ లో “రామ్ నగర్ బన్నీ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ గ్రాండ్ ఈవెంట్ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి తన వంతు ఆర్థిక సహాయాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి అందజేశారు హీరో చంద్రహాస్.

RAm nagar bunny movie 1

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ – ప్రభాకర్ నాకు సుపరిచితులు. ఆయన రామ్ నగర్ బన్నీ సినిమా గురించి చెప్పి నన్ను ఇన్వైట్ చేశారు. ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. చంద్రహాస్ మా అమ్మాయి క్లాస్ మేట్. తెలంగాణలో వరద బాధితులను ఆదుకునేందుకు చంద్రహాస్ తన వంతు సహాయాన్ని అందించడం సంతోషంగా ఉంది. మొదటి సినిమాకు హీరోలు అంతగా ఆకట్టుకోరు. కానీ చంద్రహాస్ బాగున్నాడు. ఫస్ట్ లుక్, గ్లింప్స్ తో ఆకట్టుకున్నాడు. అతన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా. అలాగే కుటుంబ సభ్యులు ఆయన ఎలా ఎదగాలని కోరుకుంటున్నారో ఆ స్థాయికి చంద్రహాస్ చేరుకోవాలని బెస్ట్ విశెస్ అందిస్తున్నా. అన్నారు.

RAm nagar bunny movie 3

‘ఆటిట్యూడ్ స్టార్’ చంద్రహాస్ మాట్లాడుతూ – మా “రామ్ నగర్ బన్నీ” ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. రెండేళ్ల క్రితం ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఆటిట్యూడ్ చూపిస్తున్నాడు అని కామెంట్స్ చేశారు. నేను సినిమాల్లో ఒకలా, బయట మరొకలా బిహేవ్ చేయను. నా మనసులో ఏముందో అదే మాట్లాడుతుంటా. అది కొందరికి నచ్చలేదు.

ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయాలనే కోరికతో హీరోగా మారాను. అందుకు మా అమ్మా నాన్నలు ఎంతో సపోర్ట్ చేశారు. మా నాన్న ప్రభాకర్ పేరు నిలబెట్టేలా కష్టపడతాను. నా ప్రతిభను నా సినిమాల రిజల్ట్ ద్వారానే తెలియజేయాలని భావిస్తున్నా. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నా. వాటిలో ఫస్ట్ మూవీగా రామ్ నగర్ బన్నీ మీ ముందుకు రాబోతోంది. నెక్ట్ మంత్ అక్టోబర్ లోనే మా సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం.

RAm nagar bunny movie 7

ఇక నుంచి రెగ్యులర్ గా మా మూవీ అప్డేట్స్ ఇస్తాం. అందరికీ కనెక్ట్ అయ్యే మూవీ ఇది. ఒక ఫ్లోలో వెళ్తుంటుంది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది. రామ్ నగర్ బన్నీ అనేది ఏ భాషలో సినిమా రిలీజ్ చేసినా కనెక్ట్ అయ్యే టైటిల్. ప్రజల్ని ఎంటర్ టైన్ చేయాలని ఎలా అనిపించిందో వాళ్లు వరద బాధల్లో ఉన్నప్పుడు కూడా నా వంతుగా సాయం చేసి వాళ్లకు సంతోషాన్ని పంచాలని అనిపించింది.

అందుకే నా కొద్దిపాటి సంపాదనలో వీలైనంత తెలంగాణ, ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమా కలెక్షన్స్ లో 10 శాతం కూడా వరద బాధితుల సహాయార్థం అందిస్తాం. ఇప్పుడే కాదు భవిష్యత్ లోనూ నాకు వీలైనంత సహాయాన్ని సొసైటీ కోసం చేస్తాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

RAm nagar bunny movie

నటీనటులు:

చంద్రహాస్, విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర, మురళీధర్, సలీమ్ ఫేకు, మధునందన్, సుజాత, విజయలక్ష్మి, సమీర్, లక్ష్మణ్ టేకుముడి, ప్రణయ్ గణపూర్, శివ, హృశికేష్ గజగౌని, తదితరులు

టెక్నికల్ టీమ్:

పబ్లిసిటీ డిజైన్ – మ్యానీ, ఆర్ట్ డైరెక్టర్ – రాజశేఖర్, ఎడిటింగ్ – మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రఫీ- అష్కర్ అలీ, మ్యూజిక్ డైరెక్టర్ – అశ్విన్ హేమంత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విజయ్, పీఆర్ఓ – సురేష్ కొండేటి, సమర్పణ – దివిజ ప్రభాకర్, నిర్మాతలు – మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ, రచన, దర్శకత్వం – శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *