మోహన్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప మూడో పాట ! 

IMG 20250317 WA0246 scaled e1742212857704

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి థర్డ్ సింగిల్ అప్డేట్ వచ్చింది. “మహాదేవ శాస్త్రి పరిచయ గీతం”ను మార్చి 19న డాక్టర్ ఎం. మోహన్ బాబు గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఆవిష్కరించనున్నారు.

మోహన్ బాబు గారు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడమే కాకుండా మహాదేవ శాస్త్రి పాత్రను కూడా పోషించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను విడుదల చేయనున్నారు.

డాక్టర్ ఎం. మోహన్ బాబుతో పాటుగా ఈ చిత్రంలో విష్ణు మంచు, ప్రీతి ముకుందన్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, ముఖేష్ రిషి, కాజల్ అగర్వాల్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు మిస్టర్ స్టీఫెన్ దేవస్సీ స్వరపరిచిన పాటలు ఇప్పటికే శ్రోతలను అలరించాయి. ఇక ఇప్పుడు మూడో పాటగా మహ దేవ శాస్త్రి పరిచయ గీతాన్ని విడుదల చేయనున్నారు.

అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై డా. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రాన్ని ముకేష్ కుమార్ సింగ్ తెరకెక్కించారు. ఏప్రిల్ 25న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *