గురు సుక్కూ ని ఫాలో అవుతున్న ఉప్పెన బుచ్చి బాబు?. మరి మిగిలిన వెయిటింగ్ లిస్ట్ డైరెక్టర్ల కు ఆ దైర్యం లేదా ?

ram CHARAN BUCCHI BABU COMBO 1 e1669744694542

టాలీవుడ్ లో చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. అవి ఏంటంటే ఒక డైరెక్టర్ ఫస్ట్ సినిమా హిట్ అయితే ఆ డైరెక్టర్ ఇస్ ఎంతో కొంత అడ్వాన్స్ ఇచ్చి పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు లాక్ చేయడం అల్లనే ఆ యంగ్ డైరెక్టర్ బిగ్ స్కేలు సినిమా అంటూ టాప్ హీరో కి కధ చెప్పడం.

SUKUMAR BUCCHIBABU

ఇలా కధ విన్న ఆ టాప్ హీరో లు తన డేట్స్ కాళీ లేకపోయినా ఈ కధ కు  ఇంప్రెస్ అయ్యి కధ మరియు దర్శకుడు వెరే హీరో దగ్గరకు వేల్లకుండా తన అధీనం లోనే కూర్చో బెట్టడం.

ram CHARAN BUCCHI BABU COMBO

ఇలా వెయిటింగ్ బెంచ్ డైరెక్టర్ లు లిస్ట్ టాలీవుడ్ లో  చాలానే ఉంది. తరవాత ఒక సంవత్సరం లేదా రెండో సంవత్సరం లో ఆ కధ మీద లేదా ఆ డైరెక్టర్ మీద మోజు తగ్గి ఇంకో హీరో ని చూసుకో అని చెప్తారు లేదా ఇంకా అలానే కూర్చో బెడతారు.

ram CHARAN BUCCHI BABU COMBO 1

ఇప్పుడు నిన్ననే జరిగిన ఒక క్రేజీ కాంబోతో మన కధ మొదలు పెడదాము.  ఎన్టీఆర్ లాంటి ఓ పెద్ద స్టార్ కు కథ చెప్పి, అతను రావడం లేట్ అవుతోందని తెలిసి, అతని కోసం ఆగకుండా మరో హీరో దగ్గరకు వెళ్లిపోవడం అంటే టాలీవుడ్ కు సంబంధించినంత వరకు చాలా ధైర్యం కావాలి.

ram CHARAN BUCCHI BABU COMBO 4

కానీ, ఉప్పెన సినిమా తో ఉప్పెనలా వచ్చిన  డైరక్టర్ బుచ్చిబాబు ధైర్యం చేసాడు. టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ కు దారి తీసాడు. కానీ ఇలా చేయడం వలన మరోసారి ఎన్టీఆర్ దగ్గరకు రానిస్తాడా అనే భయం వెన్నాడుతూనే ఉన్నా తన గురు సుకుమార్ ఉన్నాడు అనే దైర్యం చేశాడా ?.

BUCCHI SUKUMAR

ఓ డైరక్టర్ ఓ హీరోకి కథ చెప్పి, అది నచ్చి, ‘సరే చేద్దాం..వుండు’ అన్న తరువాత ఇక ఆ డైకర్టర్ ప్రొఫెషనల్ కెరియర్ కు నరకమే. ఆ హీరో కంపోన్డ్ నుండి  కదలడానికి వుండదు. హీరోకి వున్న కమిట్ మెంట్లు ఎప్పుడు అయిపోతాయా అని ఎదురుచూస్తూ పడిగాపులు పడడమే తప్ప.

ram CHARAN BUCCHI BABU COMBO 7

అది చిఏ హీరో అయినా ఇదే తంతు మన టాలీవుడ్ లో జరుగుతుంది. డైరక్టర్ల మీద రుమాలు వేసి కూర్చో పెట్టిన తర్వాత  వాళ్లు అలా కూర్చోవాల్సిందే. లేక పోతే మరలా ఆ హీరో ఫ్రెండ్స్ సర్కిల్స్ లో తనకు అవకాశాలు దొరకవు అనే భయం తో కాలయాపన చేస్తున్న పెద్ద డైరెక్టర్ కూడా ఉన్నాడు.

CHIRU Buchi Babu sUKUMAR

పోనీ అలా ఖాళీగా కూర్చోవడమే కదా అనుకుంటే కానే కాదు. ప్రతి దర్శకుడిని నమ్ముకుని ఓ చిన్నదో, పెద్దదో టీమ్ వుంటుంది. ప్రాజెక్టు కు నిర్మాత వుంటే వాళ్ల పోషణ భారం సదరు నిర్మాత మీద పడుతుంది.

NTR BUCCHI

లేదూ అంటే తన జేబులోంచి పెట్టుకోవాలి. ఆ సంగతి ఎలా వున్నా, హీరో ఏదో సినిమా చేసుకుంటూ రెమ్యూనిరేషన్ అందుకుంటూనే వుంటాడు. కానీ దర్శకుడు మాత్రం రెమ్యూనిరేషన్ లేకుండా వెయిటింగ్ లిస్ట్ లో మేర నెంబర్ కబ్ ఆఏగా అంటూ తన ఫ్రెండ్స్ పిలిచిన ప్రతి సినిమా ఫంక్షన్ కి వెళ్ళి తన హీరో ని పొగడాలి.

ram CHARAN BUCCHI BABU COMBO 2

హీరో తను సినిమా చేస్తున్నట్లు గానే దర్శకుడిని కూడా ఓ సినిమా చేసుకుని రమ్మంటే అది వేరుగా వుంటుంది. కానీ అలా అనే హీరోలు చాలా తక్కువ. కేవలం పవన్ కళ్యాణ్ సినిమాను నమ్ముకుని ఏళ్లకు ఏళ్లుగా హరీష్ శంకర్ అలా పడిగాపులు పడుతున్నారు.

Bhavadeeyudu HARISH

ఎన్ని కోట్లు నష్టం వ్యక్తిగతంగా ఆయనకు? ఆయన కూడా ఇలా తెగించి వుంటే ఈపాటికి కనీసం రెండు సినిమాలు అందించి వుండేవారు. ఇలా చాలా మంది వున్నారు. కానీ పైకి మాట్లాడలేరు అంతే.

PAWAN HARISH COMBO

కానీ ఉప్పెన అంత దైర్యం తో  బుచ్చిబాబు ధైర్యం చేసారు. ఉప్పెన తరవాత ఇన్నేళ్లు ఖాళీగా వున్నారు. కొరటాల శివ సినిమా అయ్యే వరకు ఎన్టీఆర్ రారు. ఇంకెన్నాళ్లు వేచి వుండాలి. గతంలో ఓసారి బుచ్చిబాబు గురువు సుకుమార్ కూడా ఇలాగే మహేష్ కు కథ నచ్చకపోతే బన్నీ దగ్గరకు వెళ్లి పుష్ప తీసారు.

BANNY SUKUMAR

ఇప్పుడు అదే ట్రెండ్ ఫాలో అయ్యారు బుచ్చిబాబు. డైరక్టర్ లు తమ కోసం ఆగరు, మరో హీరో దగ్గరకు వెళ్లిపోతారు అనే భయం హీరోలకు వస్తేనే ఈ వెయిటింగ్ లిస్ట్ దర్శకులు పరిస్థితి మారుతుంది.

ram CHARAN BUCCHI BABU COMBO 5 1

అలా రావాలి అంటే ముందుగా దర్శకులకు తన మీద తన  సబ్జెక్ట్ మీద భలమైన  నమ్మకం దైర్యం వుండాలి. చూద్దాం అప్పటి సుకుమార్ ఇప్పటి  ఉప్పెన బుచ్చి బాబు ని ఎంత మంది దర్శకులు ఫాలో అవుతారో..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *