Theppa Samudram Movie song gone viral: “తెప్ప సముద్రం” సిన్మా లో మంగ్లీ పాడిన పాటకి 2 మిలియన్ వ్యూస్

teppa sumudram సాంగ్ review e1695539372248

శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అర్జున్ అంబటి, చైతన్య రావు హీరోలుగా కొరమీను ఫేమ్ కిశోరి దాత్రక్ హీరోయిన్ గా రవి శంకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తెప్ప సముద్రం. సతీష్ రాపోలు దర్శకత్వంలో నీరుకంటి రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి పి.ఆర్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా నుంచి సింగర్ మంగ్లీ పాడిన “యాడున్నాడో” మాస్ బీట్ పాట ఎమ్ ఆర్ టి (MRT) ఆడియో ద్వారా విడుదల అయింది. అయితే ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో రెండు మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తుంది.

ఈ సందర్భంగా నిర్మాత రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ “తెప్ప సముద్రం” కథ నచ్చి ఖర్చుకు వెనకాడకుండా నిర్మించడం జరిగింది. సినిమా కూడా అద్భుతంగా వచ్చింది. అయితే సింగర్ మంగ్లీ పాడిన మాస్ బీట్ పాట “యాడున్నాడో” ను ఎమ్ ఆర్ టి (MRT) ఆడియో ద్వారా విడుదల చేసాం, ఇప్పుడు ఆ పాట యూట్యూబ్ లో ఇరవై లక్షల వ్యూస్ తో ట్రేండింగ్ లో ఉంది. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం” అని తెలిపారు.

Teppa Sumudram songs 1

దర్శకుడు సతీష్ రాపోలు మాట్లాడుతూ “గత పదేళ్లుగా చిత్ర పరిశ్రమలో దర్శకత్వ శాఖలో పని చేసాను. తెప్ప సముద్రం కథ నచ్చి నిర్మాత ముందుకు రావడం జరిగింది. అర్జున్, చైతన్య, కిశోరి, రవి శంకర్ గారు అద్భుతంగా సపోర్ట్ చేశారు. మా సంగీత దర్శకుడు పి.ఆర్ గారు అద్భుతమైన పాటలు అందించారు. మంగ్లీ పాడిన “యాడున్నాడో” పాట యూట్యూబ్ లో ట్రేండింగ్ అవుతుంది. ఇప్పటికే ఇరవై లక్షల వ్యూస్ తో అద్భుతమైన కామెంట్స్ తో దూసుకుపోతోంది. మా చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తాం” అని తెలిపారు.

చిత్రం పేరు : తెప్ప సముద్రం

నటి నటులు : అర్జున్ అంబటి, చైతన్యరావు, తదితరులు

 

పాటలు: మంగ్లీ, పెంచల్ దాస్, హేమచంద్ర

సాహిత్యం : పెంచల్ దాస్, పూర్ణాచారి, బాలాజీ, పి.ఆర్

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : శేఖర్ పోచంపల్లి

సంగీతం : పి.ఆర్

డిజిటల్ మార్కెటింగ్ – ఎస్ 3 డిజిటల్ మీడియా

పి ఆర్ ఓ : పాల్ పవన్

నిర్మాత :నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్

కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం : సతీష్ రాపోలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *