తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా అష్టదిగ్బంధనం సినిమా  ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ !

astadrigbandam movie first look poster launch e1673090088835

ఎమ్.కె.ఎ.కె.ఎ ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై మనోజ్ కుమార్ అగర్వాల్ నిర్మాతగా బాబా పి.ఆర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ” అష్టదిగ్బంధనం ” ఎ గేమ్ విత్ క్రైమ్ ” ఉప శీర్షిక “. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సినిమాటోగ్రఫీ మినిస్టర్ ” శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ” రిలీజ్ చేశారు.

అష్టదిగ్బంధనం టైటిల్ చాలా బాగుందని, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియజేశారు.
astadrigbandam movie first look poster launch 5
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మనోజ్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ ఈరోజు అష్టదిగ్బంధనం మూవీ పోస్టర్ రిలీజ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా జరిగిందని ఆయన మా కోసం సమయం వెచ్చించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.

ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచబోతున్నామని ఆయన పేర్కొన్నారు. డైరెక్టర్ బాబా పిఆర్ చాలా ఎనర్జిటిక్ అని, తను సినిమా మీద ఫుల్ ఫోకస్ పెట్టి, ఒక ప్యాషన్ తో ఈ సినిమా చేశారని మనోజ్ పేర్కొన్నారు.

astadrigbandam movie first look poster launch 3

మలయాళం బ్లాక్ బస్టర్ ట్రాన్స్ సినిమాకి ఆ సంగీతం అందించిన జాక్సన్ విజయన్ మా సినిమాలో భాగమయ్యారని ఇక ఈ సినిమాలో నాలుగు పాటలు ఉండగా కాసర్ల శ్యామ్ తన సాహిత్యం అందించారని ఆయన పేర్కొన్నారు.

సైమా అవార్డు అందుకున్న సూర్య భరత్ చంద్ర ఈ సినిమాలో నటిస్తున్నారని పేర్కొన్నారు. సంతోషం అధినేత సురేష్ కొండేటి మా పిఆర్ఓగా పనిచేయడం మాకు గర్వకారణం అని అన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు బాబా పి.ఆర్ మాట్లాడుతూ…. ఈ అష్టదిగ్బంధనం సినిమా హైదరాబాద్ నేపథ్యంగా సాగే హై వోల్టేజ్- యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అని, ఫుల్ ప్యాకడ్ యాక్షన్ సీక్వెన్స్ తో స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే ఈ సినిమా ప్రేక్షకులని కచ్చితంగా ఆకట్టుకుంటుందని బాబా పి.ఆర్ తెలిపారు.

astadrigbandam movie first look poster launch 1

మళయాలం బ్లాక్ బస్టర్ ” ట్రాన్స్ “ సినిమాకి సంగీతం అందించిన ” జాక్సన్ విజయన్ ” ని ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం చేస్తున్నామని, అలాగే ఈ సినిమా ద్వారా డిఓపిగా బాబు కొల్లబత్తులని పరిచయం చేస్తున్నామని పేర్కొన్నారు.

ఈ సినిమాలోని నాలుగు పాటలకు లిరిక్స్ కాసర్ల శ్యామ్, పూర్ణ అందించడం జరిగింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఫిబ్రవరిలో టీజర్ రిలీజ్ చేయనున్నామని ఈ సందర్భంగా దర్శకులు బాబా పి.ఆర్ తెలిపారు.

మా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సమయం వెచ్చించి రిలీజ్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.

 సినిమాలో లీడ్ రోల్ పోషించిన సూర్య భరత్ చంద్ర మాట్లాడుతూ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ప్రత్యేకంగా సమయం కేటాయించి మా సినిమా పోస్టర్ లాంచ్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.

astadrigbandam movie first look poster launch 4

దర్శకులు బాబా పి.ఆర్ గారు నాకు సినిమా కథ చెప్పినప్పుడు నేనొక లాగా ఊహించుకున్నాను కానీ షూట్ పూర్తి అయిన తర్వాత ఇంకా అద్భుతంగా సినిమా వస్తుంది. ఇప్పటికే 80 శాతం వరకు షూటింగ్ పూర్తయింది అన్నారు.

ఈ సినిమా ద్వారా నాకు మంచి నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కింది నా మీద నమ్మకం ఉంచి ఈ సినిమా అవకాశం ఇచ్చిన మా దర్శకుడు బాబా పి.ఆర్ గారికి, ప్రొడ్యూసర్ మనోజ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అని అన్నారు.

 హీరోయిన్ ఇషికా మాట్లాడుతూ….. తాను ఇప్పటికే రెండు సినిమాలు చేశానని అవి విడుదల కావాల్సి ఉన్నాయని అన్నారు. తన మూడో సినిమాగా అష్టదిగ్బంధనం మూవీ వస్తోందని నాలో ఉన్న నటిని గుర్తించి ఈ అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు బాబా పి.ఆర్ గారికి ప్రొడ్యూసర్ మనోజ్ కుమార్ అగర్వాల్ గారికి ధన్యవాదాలు అన్నారు.

ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ లభిస్తుందని తాను భావిస్తున్నానని ఆమె అన్నారు.
astadrigbandam movie first look poster launch 9
ఇక ఈ పోస్టర్ లాంచ్ చేసిన తర్వాత తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కొత్త తరం అంతా కలిసి చేస్తున్న ఈ అష్టదిగ్బంధనం సినిమా సూపర్ హిట్ కావాలి అని నేను కోరుకుంటున్నాను అని అన్నారు.

ఇప్పటికే సినిమా షూటింగ్ 80% పూర్తయిందని విన్నాను వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని సినిమా విడుదలై సూపర్ హిట్ కావాలని నేను అభిలాషిస్తున్నాను.

తెలుగు సినీ పరిశ్రమకు కొత్త తరం అవసరం ఎంతో ఉంది, ఇలాంటి కొత్తవారిని ప్రోత్సహించినప్పుడే మరిన్ని కొత్త సినిమాలు ప్రేక్షకులు ముందుకు వస్తాయి, ఖచ్చితంగా అష్టదిగ్బంధనం సినిమా సూపర్ హిట్ అవ్వాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

నటీనటులు:

సూర్య భరత్ చంద్ర, విషిక కోట, విశ్వేందర్ రెడ్డి, మహేష్ రావుల్, రంజిత్, రోష్ని రజాక్, వివ రెడ్డి, నవీన్ పరమార్డ్, మణి పటేల్, విజయ్ కందగట్ల, యోగేందర్ సప్పిడి, మహమ్మద్ రజాక్, తదితరులు.

సాంకేతికవర్గం:

రచన – దర్శకత్వం: బాబా పి.ఆర్
నిర్మాత: మనోజ్ కుమార్ అగర్వాల్
మ్యూజిక్: జాక్సన్ విజయన్ కెమెరా: బాబు కొల్లబత్తుల
ఎడిటింగ్: నాగేశ్వర్ రెడ్డి బొంతల
ఫైట్స్: రామ్ క్రిషన్, శంకర్ ఉయ్యాల
లిరిక్స్: శ్యామ్ కాసర్ల, పూర్ణ చారి
ఆర్ట్: వెంకట్ ఆరే
పి.ఆర్.ఓ: సురేష్ కొండేటి
ప్రొడక్షన్ మేనేజర్: కుర్మ భీమేష్
కాస్ట్యూమ్ డిజైనర్: అర్చన సావ్దేరక్
మేకప్: జి.శివ
కాస్టూమర్: ప్రవీణ్
స్టిల్స్: శ్రీకాంత్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *