“Sarangadariya” movie title & first looklaunched by Raj Tarun: రాజ్ తరుణ్ చేతులమీదుగా “సారంగాదరియా”మూవీ టైటిల్ & ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల 

Sarangadariya movie FF launch by Raj Tharun 3 e1700471987708

 

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకం పై చల్లపల్లి చలపతిరావు గారి దివ్య ఆశీస్సులతో ఉమాదేవి & శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం” సారంగదరియా” ఈ చిత్రం టైటిల్ పోస్టర్ని యంగ్ హీరో రాజ్ తరుణ్ చేతులమీదుగా విడుదల అయ్యింది.

Sarangadariya movie FF launch by Raj Tharun 1

ఈ సందర్బంగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ: సారంగదరియా ఫస్ట్ లుక్ పోస్టర్ నేను విడుదల చెయ్యడం చాలా సంతోషంగా ఉంది పోస్టర్ అండ్ టైటిల్ చూడగానే పాజిటివ్ గా చాలా బాగుంది అనిపించింది ఫ్యామిలీ చిత్రం గా త్వరలో విడుదల కానున్న ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటిస్తున్న మా రాజా రవీంద్ర అన్నకి ప్రొడ్యూసర్స్ శరత్ చంద్ర గారికి ఉమాదేవి గారికి మరియు ఈ చిత్రం తో డైరెక్టర్ గా పరిచయం అవుతున్న పద్మారావు అలియాస్ పండు కి “సారంగదరియా” సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.

Sarangadariya movie FF launch by Raj Tharun 2
ప్రొడ్యూసర్ శరత్ చంద్ర మాట్లాడుతూ: మా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ అడిగిన వెంటనే విడుదల చేసిన హీరో రాజ్ తరుణ్ గారికి చాలా థాంక్స్ త్వరలో మూవీ విడుదలకి సన్నాహాలు చేస్తున్నాము మా “సారంగదరియా” అందరికీ నచ్చేలా ఉంటుంది అని ప్రొడ్యూసర్ తెలిపారు.

డైరెక్టర్ పద్మారావు అబ్బిశెట్టి(పండు )మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం నేను “సారంగదరియా” మూవీ తో దర్శకుడిగా పరిచయమవుతున్నను ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ ఉమాదేవి & శరత్ చంద్ర గారికి ధన్యవాదాలు.
ఈ రోజు మా మూవీ పోస్టర్ విడుదల చేసిన హీరో రాజ్ తరుణ్ గారికి థాంక్యూ . చిత్రం ఇంత బాగా రావడానికి సపోర్ట్ చేసిన రాజా రవీంద్ర గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమా ఒక మధ్యతరగతి ఫ్యామిలీ లో జరిగిన కొన్ని ఘర్షణల తో కథ ఉంటుంది. మా చిత్రాన్ని త్వరలో విడుదల చెయ్యాలి అనుకుంటున్నాము త్వరలోనే మిగతా విషయాలు తెలియజేస్తాము ఆని అన్నారు.

Sarangadariya movie FF launch by Raj Tharun

నటీనటులు: 
రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్,శివ చందు, యశస్విని,మొయిన్ ,మోహిత్,నీల ప్రియా, కదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంతబాబు ,విజయమ్మ , హర్షవర్ధన్, తదితరులు

టెక్నీషియన్స్:
ప్రొడ్యూసర్స్ – ఉమాదేవి & శరత్ చంద్ర చల్లపల్లి,డైరెక్టర్ – పద్మారావ్ అబ్బిశెట్టి (పండు),ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అరుణాచల మహేష్,డైలాగ్స్-వినయ్ కొట్టి,ఎడిటర్ – రాకేష్ రెడ్డి,మ్యూజిక్ డైరెక్టర్ – M. ఎబెనెజర్ పాల్,సినిమాటోగ్రఫీ – సిద్ధార్థ స్వయంభు,లిరిక్ రైటర్స్ – రాంబాబు గోశాల & కడలి సత్యనారాయణ,అడిషనల్ రైటర్ – రఘు రామ్ తేజ్.K, పి ఆర్ ఓ: కడలి రాంబాబు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *