పాన్ ఇండియా యాక్టరస్ తమన్నా, సత్య దేవ్, మేఘా ఆకాష్, కావ్య శెట్టి నటించిన “గుర్తుందా శీతాకాలం” ట్రైలర్ వచ్చేసింది !

gurtundaa seetakalam trailer out e1670102796541

 

యంగ్ & టాలెంటెడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్, పాన్ ఇండియా యాక్టరస్ తమన్నా జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గుర్తుందా శీతాకాలం. ఈ చిత్రం ఎట్టకేలకు డిసెంబర్ 9న ప్రేక్షకులు ముందుకు రానుంది. సినిమాలోని ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులకు మంచి అంచనాలను క్రియేట్ చేస్తుంది. దీంతో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు.

gurtundaa seetakalam trailer out poster
సినిమా విడుదల కాబోతున్న తరుణంలో మేకర్స్ ఈరోజు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

Gurtunda Seetakalam Trailer 2

మన జీవితంలోని మొదటి ప్రేమ మ్యాజిక్, అందమైన రొమాంటిక్ క్షణాలను ఎప్పటికి మరచిపోలేము అటువంటి జ్ఞాపకాలను ఈ చిత్రం మరోసారి గుర్తుచేస్తుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ట్రైలర్ అద్భుతమైన ఫీల్ ను క్రియేట్ చేస్తుంది. ట్రైలర్ లో కాల భైరవ అందించిన సంగీతం మనసును మైమరిచిపోయేలా చేస్తుంది మరియు లక్ష్మీ భూపాల్ కవితాత్మక డైలాగ్‌లు ట్రైలర్ లో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.

Gurtunda Seetakalam Trailer stills

తమన్నా భాటియా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. కన్నడలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నాగశేఖర్ ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. శ్రీ వేదాక్షర ఫిలింస్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నిర్మాతలు చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చినబాబు, ఎంఎస్ రెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించారు.

Gurtunda Seetakalam Trailer stills

శీతాకాలం సీజన్ లో “గుర్తుందా శీతాకాలం” డిసెంబర్ 9న విడుదలవుతోంది

నటీనటులు:

సత్యదేవ్, తమన్నా, కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియదర్శి, సుహాసిని తదితరులు

సాంకేతిక బృందం:

స్క్రీన్ ప్లే, దర్శకత్వం – నాగశేఖర్
బ్యానర్ – వేదాక్షర ఫిల్మ్స్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్
సమర్పకులు – ఎం.ఎస్.రెడ్డి, చినబాబు
నిర్మాతలు – రామారావు చింతపల్లి, భావన రవి, నాగ శేఖర్
కొరియోగ్రఫీ – విజె శేఖర్
లైన్ ప్రొడ్యూసర్స్ – సంపత్, శివ S. యశోధర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – నవీన్ రెడ్డి
డైలాగ్స్ – లక్ష్మీ భూపాల్
సంగీతం – కాలభైరవ
ఎడిటర్ – కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రాఫర్ – సత్య హెగ్డే
విన్యాసాలు – వెంకట్
పిఆర్‌ఓ – ఏలూరు శ్రీను, మేఘశ్యామ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *